ఐదు పురాణాల్లో వినాయక గాథ..! | Vinayaka Chavithi 2024: This Festival Prominently Found In Five Puranas | Sakshi
Sakshi News home page

ఐదు పురాణాల్లో వినాయక గాథ..!

Published Fri, Sep 6 2024 4:43 PM | Last Updated on Fri, Sep 6 2024 5:36 PM

Vinayaka Chavithi 2024: This Festival Prominently Found In Five Puranas

వినాయక చవితి పండుగ గురించి, ఈ పండుగ మహాత్మ్యాన్ని గురించిన గాథలు ప్రముఖంగా ఐదు పురాణాల్లో కనిపిస్తాయి. అవి: 

1. శివ పురాణం 
2. బ్రహ్మవైవర్త పురాణం 
3. ముద్గల పురాణం 
4. స్కాంద పురాణం 
5. పద్మ పురాణం.

శివపురాణం: శివ పురాణం గణేశుడి జన్మ వృత్తాంతం, గణేశుడు గణ నాయకుడిగా మారిన వైనం, మానవ జీవితంలో గణనాథుని ప్రాముఖ్యత విపులంగా చెబుతుంది.

బ్రహ్మవైవర్త పురాణం: బ్రహ్మవైవర్త పురాణం గణేశుడి జన్మ వృత్తాంతంతో పాటు వినాయక చవితి రోజున గణేశుని పూజించే విధానం, ఈ పూజ ద్వారా మానవ జీవితంలో కనిపించే ప్రభావం చెబుతుంది.

ముద్గల పురాణం: ముద్గల పురాణం గణనాథునికి చేయవలసిన పూజలు, వాటి ప్రాముఖ్యత, గణనాథుని వివిధ అవతారాల గాథలను, వివిధ సందర్భాల్లో వినాయకుడు భక్తులను అనుగ్రహించిన సందర్భాలు, ప్రదర్శించిన మహిమల గాథలను చెబుతుంది.

స్కాంద పురాణం: స్కాంద పురాణం కూడా గణేశుడి జన్మ వృత్తాంతం, వినాయక చవితి పండుగ ప్రాముఖ్యత, గణేశుడికి సంబంధించిన పూజా విధానాలు విపులంగా చెబుతుంది.

పద్మ పురాణం: పద్మ పురాణం వినాయక చవితి విశేషాలను చాలా విస్తృతంగా వివరిస్తుంది. ప్రతేకించి వినాయక చవితి పూజలో ఉపయోగించవలసిన పూజా పత్రీ వివరాలను విపులంగా చెబుతుంది.

(చదవండి: తెలుగునాట ప్రసిద్ధిగాంచిన గణపతి ఆలయాలివే..!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement