భారత్‌లో కూడా చైనా మాదిరి కేసులు పెరగుతున్నాయంటూ కలకలం రేగింది. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో అందుకు సంబంధించిన ఏడు కేసులు గురించి వార్తలు రావడంతో ఒక్కసారిగా ఈ ఆందోళన రేకెత్తింది. ఐతే ఎయిమ్స్ ఆస్పత్రి ఈ కేసులకి చైనా న్యూమోనియాతో సంబంధం లేదని స్పష్టం చేసింది. అవి సాధారణ 'వాకింగ్ న్యూమోనియో' కేసులేనని తేల్చి చెప్పింది. అసత్య ప్రచారాలను నమ్మి భయాందోళనలు చెందొద్దని పేర్కొంది. అసలేంటీ వాకింగ్ న్యూమోనియా? దానికీ ఆపేరు ఎలా వచ్చింది? అంత ప్రమాదం కాదా? తదితరాల గురించే ఈ కథనం.
వాకింగ్ న్యూమోనియో అంటే..?
ఈ న్యూమోనియా బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగస్‌ల వచ్చే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్. ఇది ముఖ్యంగా వృద్ధులు చిన్న పిల్లల్లో ఎక్కువుగా కనిపిస్తుంది. వారే సులభంగా ఈ వ్యాధి బారినపడుతారు. రోగ నిరోధక శక్తి తక్కువుగా ఉన్నవారిలో కూడా ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంటుందని వైద్యులు చెబతున్నారు. ఇది చాలా వరకు సాధారణమైన తేలిక పాటి లక్షణాలు గల వ్యాధేనని తెలిపారు. వ్యాధి తీవ్రతను బట్టి మందులను తీసుకుంటే సరిపోతుందని అన్నారు. ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసం ఉండదని చెబుతున్నారు. అయితే ఈ రోగ నిర్థారణ అనేది సరైన పద్ధుతుల్లో చేయాలి. అందుకు తగట్టుగా చికిత్స తీసుకుంటే చాలని పేర్కొన్నారు డాక్టర్లు.
ఆ పేరు ఎలా వచ్చిందంటే..
'వాకింగ్ న్యూమోనియా' అనేది ఊపిరితిత్తు ఇన్ఫెక్షన్‌తో బాధపడే రోగులను ఉద్దేశించి పెట్టిన పేరు. దీని కారణంగా ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడుతుంటారు. పైగా జ్వరం, దగ్గు, ముక్కు కారటం వంటి సాధారణ లక్షణాలే కనిపస్తాయి. ఇవి కూడా రెండు నుంచి మూడు వారాలు మాత్రమే కనిపిస్తాయి. పరిస్థితి సాధారణ న్యుమోనియా కంటే తక్కువగానే ఉంటుంది. తేలికపాటి లక్షణాలే ఉండటంతో ఆస్పత్రిలో చేరకుండా ఇంట్లోనే చికిత్స పొందుతారు. కాబట్టి దీన్ని 'వాకింగ్ న్యుమోనియాగా' పిలిచారు వైద్యులు. ఐతే చైనాలో వచ్చే న్యూమోనియాకు దీనికి సంబంధం లేదు. అది అడెనోవైరస్, రెస్పిరేటరి సిన్సిటియల్ వైరస్(ఆర్‌ఎస్‌వీ) వల్ల వన్తున్నట్లు నివేదికలో తెలిపింది.
అవి విలక్షణమైన న్యూమోనియాకి సంబంధించిన కేసులు. అయితే ఇది కరోనా మాదిరిగా ప్రబలంగా లేదని తీవ్రత తక్కువగానే ఉందని చైనా స్పష్టం చేసింది కూడా. వైద్యులు సైతం ఈ న్యూమోనియా తీవ్రత రేట్లు ఒక్కోసారి మారుతూ ఉంటాయిని చెబుతున్నారు. అయితే ఇది అంటువ్యాధి అని, ఇది దగ్గినా లేదా తుమ్మినప్పుడు ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని అందువల్ల జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది యాంటీబయోటిక్‌లకు లొంగినప్పటికీ మళ్లీ ఈ వ్యాధి తిరగబెడుతుంటుందని తెలిపారు. ముఖ్యంగా కౌమరదశలో ఉన్న పిల్లలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు.
ఆందోళన చెందాలా?
వైద్యులు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వ్యక్తి గ్రత శుభ్రత తోపాటు జాగ్రత్తుల పాటిస్తే చాలని చెప్పారు. ముక్కుకి మాస్క్‌ల ధరించడం, చేతి పరిశుభ్రత పాటించడం వంటివి చేస్తే ఒకరి నుంచి మరొకరికి సంక్రమించదని అన్నారు.
చికిత్స..
- నోటి ద్వారా తీసుకునే యాంటీబయోటిక్స్‌ని ఐదు నుంచి 10 రోజుల వాడితే చాలు.
- పొరపాటును కూడా దగ్గును తగ్గించే మందులను వాడకూడదు. ఎందుకంటే వచ్చింది వాకింగ్ న్యూమోనియా అని తేలితే వైద్యుల సూచించిన మందులే వాడాలి. దగ్గుని కంట్రోల్ చేసే మందులు వాడితే శ్లేష్మం ఊపిరితిత్తులోనే ఉండి సమస్య మరింత జటిలంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
- కుటుంబంలో ఎవ్వరైన ఈ వ్యాధి బారినపడి అందరూ జాగ్రత్తలు పాటించాలి. అంటువ్యాధి కావున ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే ప్రమాదం ఎక్కువుగా ఉంటుంది. అందువల్ల చేతి పరిశుభ్రతలు, వ్యక్తిగత శుభ్రత పాటించటం అనేది అత్యంత ముఖ్యం.
(చదవండి: పప్పులు తినడం మంచిదేనా? పరిశోధనలో షాకింగ్ విషయాలు)
Comments
Please login to add a commentAdd a comment