జాతీయ కాంగ్రెస్‌ ఏం కానుంది? | Congress Party Future Guest Column By Ilapavuluri Murali Mohan Rao | Sakshi
Sakshi News home page

జాతీయ కాంగ్రెస్‌ ఏం కానుంది?

Published Sat, Mar 26 2022 12:57 AM | Last Updated on Sat, Mar 26 2022 12:57 AM

Congress Party Future Guest Column By Ilapavuluri Murali Mohan Rao - Sakshi

నూట ముప్ఫయి ఏళ్ళ ఘనచరిత్ర కలిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ త్వరలో కనుమరుగు కాను న్నదా? సోనియా, రాహుల్‌ గాంధీల నాయకత్వంలో హస్తంలోని అదృష్ట రేఖలు క్రమక్రమంగా చెరిగిపోతు న్నాయా? అసమ్మతివాదులు నాయకత్వంపై తిరుగుబాటు చేయనున్నారా? అసలు జాతీయ కాంగ్రెస్‌కు భవిష్యత్తు అనేది ఉందా? ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అభిమానులనూ, రాజకీయ పరిశీలకులనూ ఉత్కంఠకు గురిచేస్తున్న ప్రశ్నలు ఇవే! 

ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ పారిశ్రా మికంగా, వ్యవసాయకంగా దేశాన్ని పంచవర్ష ప్రణాళికల ద్వారా ముందుకు తీసుకెళ్లారు. ఇందిరా గాంధీ చేపట్టిన అనేక విప్లవాత్మక సంస్కరణలు, సంక్షేమ పథకాలతో పేదవారు తమ జీవన ప్రమాణా లను పెంచుకున్నారు. కోట్లాదిమంది పేదల హృద యాల్లో ఇందిరమ్మ తిష్ట వేశారు. ఆ తరువాత ప్రధాని అయిన రాజీవ్‌ గాంధీ టెలికాం రంగంలో విప్లవాత్మక మైన మార్పులు తెచ్చారు. ఆ తరువాత కాంగ్రెస్‌ నుంచి ప్రధానులైన పీవీ నరసింహారావు, డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ తమదైన సంస్కరణలతో ప్రగతి పథంలో పరుగులెత్తించారు. ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యానికి గురైనా, భారత్‌ మాత్రం సగర్వంగా తలెత్తుకుని నిలబడేట్లు చేశారు.

2004 నుండి పదేళ్ళపాటు తిరుగులేని అధికారం చలాయించిన యూపీఏ 2014 లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది. పంజాబ్‌లో అధికారాన్ని కోల్పో యింది. ఉత్తరప్రదేశ్‌లో 403 సీట్లకుగాను కేవలం రెండు మాత్రమే గెల్చుకుంది. ఉత్తరాఖండ్, మణి పూర్, గోవాలలో ఉనికి కోల్పోయింది.

ఈ ఘోర పరాజయానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ‘జీవిత మంతా కాంగ్రెస్‌ పార్టీకి ధారపోశాను. చివరకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది’  అంటూ  గులాం నబీ ఆజాద్‌ వాపోయారు. మరి ఇంతటి పరాజయానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? యువకుడైన రాహుల్‌ గాంధీ పదిహేనేళ్లుగా ఎంపీగా ఉంటున్నా, వారసత్వ బలం ఉన్నా, రాజకీయంగా రాణించలేక పోతున్నారు. సోనియా వృద్ధాప్య బాధల్లో ఉన్నారు. ప్రియాంకా గాంధీకి ఆకర్షణ శక్తి లేదని తేలిపోయింది. మోదీతో దీటుగా వ్యూహాలు రచించగల శక్తి వీరిలో ఎవ్వరికీ లేదని తేలిపోయింది.

పెద్ద నోట్ల రద్దుతో దేశం అల్లకల్లోలం అయింది.  జీఎస్టీతో వ్యాపార రంగం మొత్తం కుదేలైంది. సాగునీటి చట్టాలు... రైతుల సమస్యలు దేశాన్ని అతలాకుతలం చేశాయి. ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ సర్కార్‌ తెగనమ్మేస్తున్నది. ఇలాంటి ఎన్నో సమస్యలు, దురంతాలు చూస్తుంటే సామాన్యులకు కడుపు రగిలిపోతుంది కానీ రాహుల్‌ మాత్రం ఈ అవకాశాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయారు. బీజేపీ దుర్మార్గ నిర్ణయాలను కడిగేద్దామనే ఆవేశం లేదు. ఆలోచన లేదు. సీనియర్‌ నాయకుల సలహా లను తీసుకుంటున్నారో లేదో తెలియదు. 

ఒకప్పుడు రాజీవ్‌ గాంధీ రాజకీయాల్లోకి రాగానే తనకంటూ ఐదారుగురు మేధావులతో ఒక మంచి కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. ప్రధాని కాగానే వారికీ మంత్రి పదవులు, సలహాదారుల పదవులు  ఇచ్చి వారి సలహాలను, అనుభవాన్ని వాడుకున్నారు.   అలాంటివారు ఒక్కరైనా ఇప్పుడు రాహుల్‌ గాంధీ దగ్గర ఉన్నారా? పదమూడు దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి ఈ దుస్థితి కలగడం బాధాకరం. కాంగ్రెస్‌ పార్టీ మనుగడ సాగించాలంటే బలమైన నాయకత్వం అవసరం. గాంధీ నెహ్రూల చెర విడి పించుకుంటేనే కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్తు అనిపి స్తోంది. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే నాయ కత్వ మార్పు లేదనే అనిపిస్తోంది
-ఇలపావులూరి మురళీ మోహనరావు
వ్యాసకర్త సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement