వాతావరణంలో నెలకొన్న అనూహ్య మార్పులతో సోమవారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలుచోట్ల భారీవర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి కురిసిన ఎడతెరపిలేని వర్షం పలు పంటలకు నష్టం కలిగించగా, కొల్లూరులో ఇటుక పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీసింది. అకాల వర్షం.. అదీ తెల్లవారుజాము కావడంతో ఆరబెట్టిన పంట దిగుబడులను రక్షించుకునేందుకు రైతులు పరుగులు తీశారు. ఇదిలా ఉండగా గత కొన్నిరోజులుగా భానుడి భగభగలకు భీతిల్లిన ప్రజలు వాతావరణం మార్పులతో నెలకొన్న మేఘావృత వాతావరణంతో ఉపశమనం పొందారు. – సాక్షి, నెట్‌వర్క్
4నుంచి ఏఎన్‌యూలో మినీ మేనేజ్‌మెంట్ మీట్
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మినీ మేనేజ్‌మెంట్ మీట్ పోస్టర్‌ను సోమవారం వీసీ ఆచార్య పి. రాజశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామర్స్ విభాగం ఆధ్వర్యంలో మేనేజ్‌మెంట్ మీట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. కామర్స్ విభాగాధిపతి ఆచార్య శివరామ్‌ప్రసాద్ మాట్లాడుతూ కార్యక్రమంలో భాగంగా 4న క్విజ్, 5న డిబేట్, బిజినెస్ ప్లాన్, 6న సాంస్కృతిక అంశాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పి. వరప్రసాదమూర్తి, దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ బి. నాగరాజు, ఎంహెచ్‌ఆర్‌ఎం అధ్యాపకులు డాక్టర్ తులసీదాస్ పాల్గొన్నారు.
చేబ్రోలు మండలం నారాకోడూరులో కల్లాల్లోని మిర్చి తడవకుండా పట్టాలు కప్పుతున్న రైతులు
కొల్లూరు సమీపంలో వర్షానికి తడిచి పనికిరాకుండా పోయిన పచ్చి ఇటుక
రేపల్లె పట్టణంలో రోడ్డుపై నిలిచిన వర్షం నీరు
Comments
Please login to add a commentAdd a comment