గుంటూరు రూరల్: ఓ కానిస్టేబుల్ ప్రియురాలితో లాడ్జిలో ఉండగా అతడి భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. పనిచేస్తున్న స్టేషన్‌లోనే అతడిని ముద్దాయిగా నిలబెట్టింది. ఈ ఘటన గురువారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నల్లపాడు పోలీసుల కథనం ప్రకారం.. నాదెండ్ల గ్రామానికి చెందిన కత్తి శ్రీనివాసరావు నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన దివ్యతో అతనికి 2016లో పెళ్లయింది. వీరికి ఓ బాబు. ఇద్దరి మధ్యన వివాదాలు తలెత్తడంతో దివ్య పుట్టింటికి వెళ్లింది.
దీంతో శ్రీనివాసరావు రెండు రోజలుగా నల్లపాడులోని యాపిల్ లాడ్జిలో రూం తీసుకుని తన ప్రియురాలితో కలిసి ఉంటున్నాడు. ఈ విషయం తెలిసిన దివ్య మీడియాను, పోలీసులను వెంట తీసుకుని ఆ లాడ్జికి వెళ్లింది. విషయం తెలిసిన శ్రీనివాసరావు ప్రియురాలితో కలిసి రూం తలుపులు తీయకుండా భీష్మించుకు కూర్చున్నాడు. సుమారు గంట తరువాత చేసేదిలేక తలుపులు తీయటంతో దివ్య అందరిముందే ఇద్దరికీ దేహశుద్ధి చేసింది. మీడియా, పోలీసుల ఎదుట భర్త రాసలీలల బండారం బయటపెట్టింది.
అనంతరం నల్లపాడు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించి ఇద్దరూ మేజర్‌లే కావటంతో హెచ్చరించి వదిలివేశారు. ఇద్దరు మేజర్లు ఇష్టంతో కలిసి ఉండొచ్చని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు మేరకు కానిస్టేబుల్‌ను వదిలివేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో దివ్య నాదెండ్ల పోలీస్ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment