కృష్ణానదిలో గుర్తుతెలియని మృతదేహం
తాడేపల్లిరూరల్: ప్రకాశం బ్యారేజ్ సమీపంలో కృష్ణా నది దిగువ ప్రాంతంలోని గేట్ల వద్ద నీటిలో మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానిక మత్స్యకారులు తాడేపల్లి పోలీసులకు శుక్రవారం సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ జె. శ్రీనివాసరావు ఘటనా స్థలానికి వెళ్లి నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని బయటకు తీయించి పరిశీలించారు. అతడి వద్ద గుర్తించేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఎస్‌ఐ మాట్లాడుతూ సుమారు 27 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు ఉండవచ్చని, మృతుడి ఒంటిపై ఖాకీ ఫ్యాంట్ షాట్, వైలెట్ కలర్ ఫుల్‌హ్యాండ్స్ టీషర్ట్, మాసిన గడ్డం ఉందని, బహుశా ఇతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నామని చెప్పారు. ఎవరైనా ఈ మృతదేహాన్ని గుర్తిస్తే 086452721865కు ఫోన్ చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment