గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్ నిర్మాణ పనుల నిలిపివేత ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ తదుపరి పనులు చేయడం, పట్టణ ప్రణాళిక అధికారుల పర్యవేక్షణ లోపం తదితర అంశాలపై అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ఏర్పాటు చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. సోమవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్దేశిత అనుమతులు లేకుండా కేవలం డీమ్డ్ ప్లాన్‌తో నిర్మాణ పనులు చేట్టిందని తెలిపారు. గత ఏడాది తాము కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్న డాక్యుమెంట్స్‌ను పరిశీలించిన తరువాత ప్రభుత్వానికి 19 మంది అధికారుల పాత్రపై సమగ్ర నివేదిక పంపామని చెప్పారు. సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డెప్యూటీ కమిషనర్ సీహెచ్. శ్రీనివాసరావు, సిటీప్లానర్ రాంబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment