కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ప్రక్షాళన పేరుతో ఈ విభాగంపై కన్నేశారు. విజిలెన్స్ ఎస్పీ మొదలు ఇతర ప్రధాన అధికారులను వెంటనే బదిలీ చేశారు. కూటమి ప్రభుత్వ అండదండలున్న కొందరు బదిలీపై వచ్చేశారు. పోలీస్ శాఖ నుంచి ఇద్దరు సీఐలు విధుల్లో చేరారు. మండల పరిషత్ నుంచి ఎంపీడీవో పోస్ట్ ఖాళీగా ఉంది. వాణిజ్య పన్నుల శాఖ నుంచి డీసీటీవో లేదా ఏసీటీవోలను నియమించలేదు. పోలీస్ శాఖ నుంచి గతంలో డీఎస్పీగా ఉన్న శ్రీనివాసరావు బదిలీ అయ్యాక ఇప్పటి వరకు పోస్టు ఖాళీగా ఉంది. ఎన్నికల తర్వాత ఎస్‌ఐ రామచంద్రరెడ్డిని ఇంటెలిజెన్స్‌కు బదిలీ చేశారు. ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు (హెచ్‌సీ), సుమారు ఎనిమిది మంది కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ కాలేదు. కీలకమైన తహసీల్దార్ పోస్ట్ ఖాళీగా ఉంది. గతంలో ఆ విధులు నిర్వర్తించిన నాగమల్లేశ్వరరావు కృష్ణా జిల్లా అవనిగడ్డకు బదిలీ అయ్యారు. సూపరింటెండెంట్ పోస్ట్ కూడా నెలలుగా ఖాళీగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment