24న కలెక్టరేట్ ఎదుట ధర్నా
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునఃప్రారంభిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ముందు 24వ తేదీన ధర్నా నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ చెప్పారు. స్థానిక భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24వ తేదీ నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న ధర్నాల్లో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు, నగర అధ్యక్షులు రావుల అంజిబాబు, కార్పెంటర్ యూనియన్ నాయకులు కాయల రామారావు, బొట్టు శ్రీనివాసరావు, చల్లా మరియదాసు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment