లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని వృద్ధురాలు (55) మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ గుంటూరు ప్లాట్‌ఫాం –1 వద్దకు చేరుకునే సరికి రైలులో గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెంది ఉంది. సమాచారం తెలుసుకున్న జీఆర్పీ పోలీసులు ఘటన స్థలం వద్దకు చేరుకుని మృతురాలి వివరాలను సేకరించగా ఎలాంటి వివరాలు లేక పోవడంతో పోలీసులు గుర్తు తెలియని మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వ సమగ్రాస్పత్రికి తరలించారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు జీఆర్పీ సీఐ అంజిబాబు 9440627546, ఎస్‌ఐ దీపికా 9121715242, జీఆర్పి పోలీస్ స్టేషన్ 0863–2220753 నంబర్లకు సమాచారం తెలియజేయాల్సిందిగా తెలిపారు.