
గుంటూరు
శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
గ్రామాల్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
వినుకొండ: గ్రామాల్లో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. బుధవారం ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. టీడీపీ నాయకుల దాడిలో గాయపడి ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న లక్కిశెట్టి బుచ్చమ్మ, రాగాల భువనేశ్వరిలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోని వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలోనూ ఇలాంటి దాడులు జరుగుతున్నాయని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ పోలీసుల ద్వారానే అక్రమ కేసులు బనాయించడం, అర్ధరాత్రి అరెస్టులు చేయడం, బెదిరించడం వంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రోద్బలంతోనే గ్రామాల్లో ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ దాడులకు ఎవరూ భయపడరని, ఎదురు తిరిగే రోజు వస్తుందన్నారు. మహిళలని కూడా చూడకుండా దాడి చేసి కాలు విరగ్గొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకన్నా దారుణం ఎక్కడుందని కూటమి పాలకులను నిలదీశారు. చిన్న గొడవలు జరిగినా హత్యాయత్నం కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు చెప్పారు. టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి దెబ్బలు తగలకపోయినా 307 కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ దాడులను ఖండించాల్సింది పోయి ప్రోత్సహించడం ఎమ్మెల్యేకు తగదని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే వెంట పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
తెనాలి: బుర్రిపాలెం రోడ్డులోని మున్సిపల్ కంపోస్టు యార్డు ఖాళీ చేసే ప్రక్రియ పనులు నత్తనడక నడుస్తున్నాయి. రెండునెలలుగా 20 వేల టన్నుల వ్యర్థాలను మాత్రమే విభజన చేశారు. ఇంకా 80 వేల టన్నుల చెత్తనిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. ఏప్రిల్ ఆఖరుకు యార్డు ఖాళీ చేస్తామన్న అధికారులు హామీ నెరవేరేలా కనిపించటం లేదు. ఎంతోకాలంగా ప్రజలు ఎదురుచూస్తున్న కంపోస్టు యార్డు సమస్యకు ఇప్పట్లో మోక్షం లభించేలా లేదని పెదవి విరుస్తున్నారు.
రోజుకు 80 టన్నుల చెత్త ఉత్పత్తి
తెనాలి పట్టణ జనాభా ఏటికేడాది విస్తరిస్తుండటం తెలిసిందే. జనాభా రెండు లక్షలకు చేరుకుంది. రోజురోజుకీ చెత్త పెరుగుతోంది. ప్రస్తుతం పట్టణంలో రోజుకు 80 టన్నుల చెత్త వస్తోంది. ఇందులో తడిచెత్త, పొడిచెత్త, ప్లాస్టిక్ సంచులు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటున్నాయి. రోజువారీ చెత్తను తగ్గించాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇదే కంపోస్టుయార్డులో తడిచెత్తనుంచి వర్మీకంపోస్టు, బయోగ్యాస్ తయారీ యూనిట్లను నిర్వహిస్తున్నారు. ఇకపోతే మిగిలిన చెత్తంతా యార్డులో పేరుకుపోతోంది.
ప్రజలందరికీ కష్టాలే..!
కంపోస్టు యార్డు సమీపంలోని పంటపొలాలకు చెత్త సమస్యగా మారిందని సమీప రైతులు ఎప్పటి నుంచో ఫిర్యాదుచేస్తున్నారు. ఈ చెత్త వల్ల ప్రహరీలు పడిపోతుండటం మరో సమస్య. వీటికితోడు చెత్తనుంచి మిథైల్ గ్యాస్ విడుదలవుతూ, చెత్త దానికదే తగులబడుతోంది. వ్యర్థాల దగ్థంతో రోజుల తరబడి హానికరమైన పొగలు చుట్టుపక్కల అరకిలోమీటరు వరకూ వ్యాపిస్తున్నాయి. ప్రజలు కళ్లు మండడంతోపాటు ఊపిరి పీల్చుకో వటానికి ఇబ్బంది పడుతున్నారు. ఆ దారిలోనే పలు విద్యాసంస్థలు, దాల్ మిల్లులు ఉన్నాయి. అతిదగ్గర్లోనే అపార్టుమెంట్లు, బీసీ కాలనీ ఉన్నాయి. కంపోస్టు యార్డు కారణంగా ఆయా ప్రాంతాల్లోని ప్రజలంతా బాధపడుతున్నారు. చెత్త తొలగించాలని కోరుతున్నారు.
9
న్యూస్‌రీల్
మున్సిపల్ కంపోస్టు యార్డు వ్యర్థాల తొలగింపులో జాప్యం ఏప్రిల్ ఆఖరుకు ఖాళీ చేస్తామన్నఅధికారుల హామీకి తూట్లు రెండునెలల్లో కేవలం 20 వేల టన్నులు మాత్రమే తొలగింపు యార్డులో ఇంకా 80 వేల టన్నులు
పేరుకున్న
లక్ష టన్నుల వ్యర్థాలు!
24 గంటలు పనిచేసేలా ప్రణాళిక
కంపోస్టు యార్డు నుంచి వ్యర్థాల తొలగింపు పనుల వేగవంతానికి 24 గంటలు పనిచేసేలా ప్లాన్ చేస్తున్నాం. కాంట్రాక్టు ప్రకారం 63 వేల టన్నులు తొలగించాలి. తర్వాత మిగిలిపోయే దాదాపు 35 వేల టన్నుల వ్యర్థ్యాల తొలగింపు విషయం తర్వాత ఆలోచిస్తాం. ఇదే కంపెనీకి ఇవ్వాలా? మళ్లీ టెండర్లు పిలవాలా? అనేదానిపై నిర్ణయం తీసుకుంటాం.
– ఆకుల శ్రీనివాసరావు,
మున్సిపల్ ఇన్‌చార్జి ఇంజినీరు
తొలగించింది 20వేల టన్నులే..!
గత జనవరి 15 నుంచి అమల్లోకి వచ్చిన కాంట్రాక్టు గడువు జులై 15వ తేదీ నాటికి పూర్తవుతుంది. టెండరు పిలిచినపుడు 63 వేల టన్నుల తొలగింపునకు కాంట్రాక్టు ఇచ్చారు. ప్రస్తుతానికి ఇందులో మూడో వంతు అంటే 20 వేల టన్నులను మాత్రమే తీయగలిగారు. టెండరు ప్రకారం ఇంకా 43 వేల టన్నుల వ్యర్థాలున్నాయి. ఏప్రిల్ నాటికి యార్డు ఖాళీచేస్తామని మున్సిపల్ అధికారులు ప్రకటించారు. ఇలాగే పనులు కొనసాగితే జూలై పూర్తయ్యేలోగానైనా వ్యర్థాల తొలగింపు జరుగుతుందనే నమ్మకం లేదు. కాంట్రాక్టు పూర్తయ్యాక ఇంకా తొలగించాల్సిన వ్యర్థ్యాలు మరో 35 వేల టన్నులు ఉండిపోతాయి. మరి వాటి సంగతి ఏం చేస్తారనేది తెలియాల్సి ఉంది. మొత్తంమీద కంపోస్టు యార్డు కథ ఇప్పట్లో కంచికి చేరేలా కనిపించటం లేదు.
కంపోస్టు యార్డులోని వ్యర్థాల పరిమాణంపై 2022లో డ్రోన్‌తో సర్వే చేశారు. అప్పటికి 63,555 టన్నులు ఉన్నట్టు అంచనా వేశారు. గత రెండేళ్లలో మరో 35 వేల టన్నులు చేరి ఉంటుందన్నది అంచనా. మొత్తం లక్ష టన్నుల వ్యర్థాలు అన్నమాట. సమీప బుర్రిపాలెంకు చెందిన కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కంపోస్టుయార్డును అక్కడ్నుంచి తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. దీనిపై అధికారులు టెండర్లు పిలిచారు. ప్రస్తుతం టన్నుకు రూ.503 చొప్పున రూ.3.17 కోట్లకు టెండరు ఖరారైంది. అమృత్ నిధులు, మున్సిపల్ సాధారణ నిధుల నుంచి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. టెండరు దక్కించుకున్న హైదరాబాద్‌కు చెందిన సుధాకర ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధునిక ట్రెమ్మెల్‌ను ఫిబ్రవరిలో ఇక్కడకు చేర్చింది. ముందుగా కూలీలను నియమించి చెత్తలోని పెద్ద టైర్లు, కర్రలు, రాళ్లను తొలగించేశారు. తర్వాత ట్రెమ్మెల్‌తో ప్లాస్టిక్, ఇతర చెత్త ఒకవైపు చేర్చుతుండగా, మరోవైపున మట్టి, ఇసుక, కంకర వంటివి గుట్టపోస్తున్నారు. మట్టిని కొందరు రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ వెంచర్లకు తీసుకువెళుతున్నారు. ప్లాస్టిక్, ఇతర చెత్తను జిందాల్/సిమెంటు ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. మరోవైపు రోజువారీ పట్టణంలోంచి వచ్చే చెత్తను ఇందులో చేర్చకుండా కంపోస్టు యార్డులోనే ప్రత్యేకంగా వేయిస్తున్నారు. మున్సిపల్ వాహనాల్లో ఆ చెత్తను జిందాల్‌కు పంపేస్తున్నారు.

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు