
గుంటూరు
బుధవారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
వైభవంగా ఆలయ వార్షికోత్సవం
నిజాంపట్నం: అడవులదీవి గ్రామంలో వేంచేసియున్న అనంత సాయిబాబా మందిర 15వ వార్షికోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. బాబాకి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక అలంకరణ చేశారు.
రేపు బ్రహ్మంగారి ఆరాధన తిరునాళ్ల
కర్లపాలెం: ఏట్రవారిపాలెంలో పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఆరాధన తిరునాళ్ల గురువారం జరుగుతాయని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మంగళవారం తెలిపారు.
శిలువ పాదయాత్ర
నాదెండ్ల: ఇర్లపాడు విచారణ ఆర్‌సీఎం సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గ్రామం నుంచి కనపర్రు బాలయేసు పుణ్యక్షేత్రం వరకు శిలువ పాదయాత్ర నిర్వహించారు.
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): వేసవి నేపథ్యంలో అగ్నిప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. అయితే అందుకనుగుణంగా అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా లేదనే వాదన వినిపిస్తోంది. ఫలితంగా ప్రమాదాలను నియంత్రించడం ఆ శాఖకు అగ్నిపరీక్షగా పరిణమించనుంది. దీనికి సర్కారు నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. ప్రజలూ అప్రమత్తంగా ఉండా లని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు.
మిస్ట్ వాహనాలు నిరుపయోగం
ప్రస్తుతం గుంటూరు జిల్లాలో గుంటూరు, 1, 2, తెనాలి, మంగళగిరి, పొన్నూరు, వెలగపూడి, హైకోర్టు, సీఎం క్యాంపు కార్యాలయంలో ఫైర్ స్టేషన్లు ఉన్నాయి. వెలగపూడి, హైకోర్టు, సీఎం క్యాంపు కార్యాలయాల్లో ఉన్న అగ్నిమాపక దశాలు తాత్కాలికమే. వీటితోపాటుగా సీఎం కాన్వాయ్ విధుల్లో ఒక అగ్నిమాపక వాహనం ఉంటుంది. జిల్లాలో ఒక డీఎఫ్‌వో, ఇద్దరు ఏడీఎఫ్‌వోలు కలిపి 138 మంది సిబ్బంది ఉండాలి. మొత్తం ఏడు ఫైరింజన్లు, 5 మిస్ట్ బుల్టెట్లతోపాటు ఆధునిక అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉడాలి. వీటిలో మిస్ట్ జీప్, మిస్ట్ బుల్లెట్ ఉన్నా నిరుపయోగంగా ఉన్నాయి. వీటి టైర్లు ఎండకు పాడైపోతున్న దుస్థితి. ఫైరింజన్ వెళ్ళలేని స్థితిలో మిస్ట్ వాహనాల ద్వారా మంటలు అదుపుచేస్తారు. వీటికి ఉండాల్సిన ట్యాంకర్లూ లేవు. మిస్ట్ జీప్, బుల్లెట్లు దుమ్ముపట్టుకుపోయాయి. ఫ్లోటింగ్ పంపు, చిన్నచిన్న సందుల్లోకి వెళ్ళే డీసీపీ ట్రాలీల నిర్వహణ సరిగా లేదు.
సిబ్బంది కొరత
గుంటూరు జిల్లాలో అగ్నిమాపక శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. జిల్లాలో ఇద్దరు ఏడీఎఫ్‌లు ఉండాల్సి ఉండగా ఒకరే ఉన్నారు. స్టేషన్ ఆఫీసర్‌లు ముగ్గురు, లీడింగ్ ఫైర్‌మెన్ 21, డ్రైవర్‌లు 21, ఫైర్‌మెన్‌లు 67 మంది ఉండాల్సి ఉండగా.. ఫైర్‌మెన్‌లు 38 మంది మాత్రమే ఉన్నారు. 20 మంది హోంగార్డులతో ఈ స్థానాలు భర్తీ చేశారు. ఇంకా పది మంది సిబ్బంది కొరత ఉంది. ఇప్పటికే ప్రతిపాదనలు పంపినా సర్కారు నుంచి స్పందన లేదు. ఉన్న సిబ్బందికి సరైన తర్ఫీదు కూడా లేదు.
ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ ప్రమాదాలకు నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. గ్యాస్ సిలిండర్ల లీక్‌లు, షార్ట్‌సర్క్యూట్‌ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే 101కు డయల్ చేయాలి. అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలకూ అవగాహన కల్పిస్తున్నాం.
– ఎం.శ్రీనివాసరెడ్డి, జిల్లా, అగ్నిమాపకశాఖాధికారి
7
న్యూస్‌రీల్
జిల్లాలో ప్రమాదాలు ఇలా..
అగ్నిప్రమాదాల నియంత్రణ పెను సవాలే మూలనపడిన అత్యాధునిక వాహనాలు
అరకొర సిబ్బందే గతి వేసవి నేపథ్యంలో అప్రమత్తత అవసరం

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు