
వృద్ధురాలి హత్యలో ప్రస్ఫుటమైన పోలీసుల నిర్లక్ష్యం
ఉదయం 4.30 సమయంలో బారా ఇమాంపంజా మసీదు సెంటర్ వద్ద జరిగిన ఘర్షణ సమయంలో నలుగురు నిందితులు అక్కడే ఉన్నట్లు సమాచారం. అక్కడికి వచ్చిన ఏఎస్‌ఐ నిందితులను వదిలి పెట్టడం, స్టేషన్ సెక్టార్ ఎస్‌ఐకు సమాచారం ఉన్నప్పటీకీ స్పందించకపోవటంతోనే షాజహాన్‌పై దాడి, వృద్ధురాలు ఖాజాబీ హత్య, ప్రభుత్వాసుపత్రి వద్ద హసన్‌పై దాడి జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వృద్ధురాలి హత్య జరిగిన తరువాత సదరు స్టేషన్ సిబ్బంది, రక్షక్ వాహన సిబ్బంది స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు గంటన్నరకు పైగా సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఫైరోజ్, ఫయాజ్‌లు పోలీసుల అదుపులో ఉండగా, మరో ఇద్దరు నిందితులైన ఆసీఫ్, సన్ని ఇంతవరకు దొరకలేదు. నిందితుల్లో ఒకరైన ఆసీఫ్‌కు రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
అప్పుడే స్పందించి ఉంటే..?