
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి
మేడికొండూరు: పార్టీ నేతలంతా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. మండలంలోని పాలడుగులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో జరిగిన ‘గావ్ చలో’ అభియాన్ (పల్లెకు పోదాం చలో) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. అనంతరం మేడికొండూరు మండల మాజీ అధ్యక్షుడు ఆమతి వెంకటరమణ నివాసంలో స్థానిక నాయకులతో మాట్లాడారు. పార్టీ నేతలంతా ప్రజలకు చేరువ అవడానికి కృషి చేయాలని చెప్పారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ సమావేశంలో మాట్లాడారు. పార్టీ మండల అధ్యక్షుడు బాషా, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి. సుబ్బారావు, జిల్లా ఇన్‌చార్జి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు
మోదీ ఫొటో లేకపోవడంపై ఆగ్రహం
పాలడుగు సచివాలయంలో ప్రధానమంత్రి మోదీ చిత్రపటం లేకపోవడంతో పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ఫోటోను తప్పనిసరిగా ఉంచాలని సూచించారు.