
ఆక్వా డెవిల్స్ కొత్త కార్యవర్గం
తాడేపల్లి రూరల్: ఉండవల్లి – అమరావతి కరకట్ట వెంబడి ఉన్న ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ లైఫ్ చైర్మన్, పార్లమెంట్ మాజీ సభ్యులు గోకరాజు గంగరాజు విచ్చేసి కొత్త కార్యవర్గాన్ని నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కొత్త అధ్యక్షులుగా లింగిపిల్లి రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా గోపాళం సాంబశివరావు, కార్యదర్శిగా యార్లగడ్డ వెంకట రమేష్‌కుమార్, సహాయ కార్యదర్శులుగా అమ్మిరెడ్డి రామిరెడ్డి, గుండు జనార్ధనరావు, కోశాధికారిగా కొల్లిపర వెంకట రామయ్య, కమిటీ సభ్యులుగా విశ్వనాధ పల్లి సురేష్‌కుమార్, కె. సాంబశివరాజు, పులిపాటి శ్రీనివాసరావు, యు. వెంకటరెడ్డి, వి. రామచంద్రరావు, వై. శ్రీనివాసరావు,పి. నాగేశ్వరరావు, యస్. హరిబాబు, ఎ. వెంకటేశ్వరరాజు, కె. సాంబయ్య, ఆశీర్వాదం, గఫూర్,ఎం. సాంబిరెడ్డిలను నియమించామని వెల్లడించారు. అధ్యక్షులు లింగిపిల్లి రామకృష్ణ మాట్లాడుతూ గోకరాజు గంగరాజు అప్పగించిన బాధ్యతలను కమిటీ, అసోసియేషన్ సభ్యుల సహాయ సహకారాలతో నిర్వహిస్తానని వెల్లడించారు.