
పద్మశాలి వెల్‌ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక
తెనాలి: ది పద్మశాలి వెల్‌ఫేర్ సొసైటీ, తెనాలి ఆధ్వర్యంలో స్థానిక ముత్యంశెట్టిపాలెంలోని కల్యాణమండపంలో ఆదివారం 14వ వివాహ పరిచయ వేదికను నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 600 మంది వధూవరుల పరిచయ కార్యక్రమం సాయంత్రం వరకు జరిగింది. వివాహ పరిచయ వేదిక పుస్తకాన్ని ముఖ్యఅతిథిగా హాజరైన అమృతసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కుదరవల్లి రామమోహనరావు ఆవిష్కరించారు. సొసైటీ అధ్యక్షుడు జె.నరసింహారావు, ప్రధాన కార్యదర్శి జేఎస్‌బీ ప్రభాకరరావు, కోశాధికారి దివి పురుషోత్తం, ఉపాధ్యక్షులు అక్కల శ్రీరామ్, టీవీ కృష్ణారావు, దామర్ల పరమేశ్వరరావు, కార్యదర్శులు బీజేకే నరేంద్రబాబు, దివి హేమంత్, ఓంకార్ ప్రసాద్, కటకం శేషగిరి, మదన్‌మోహన్, శంకర్ పాల్గొన్నారు. వధూవరుల పరిచయాలను వేదికపై జొన్నాదుల మహేష్, దివి పురుషోత్తమం, అక్కల శ్రీరామ్, హేమంత్ నిర్వహించారు.
అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి
పెదవడ్లపూడి(మంగళగిరి) : ప్రేమించుకున్న జర్మనీ అబ్బాయి ఆంధ్రా అమ్మాయి ఇరు కుటుంబాల అంగీకారంతో ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరికి సమీపంలోని పెదవడ్లపూడిలో ఒక్కటయ్యారు. వీరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం వైభవంగా జరిగింది. పెదవడ్లపూడికి చెందిన సుందర్శనం రవికుమార్, లక్ష్మీ దంపతుల కుమార్తె మౌనిక జర్మనీలో పీహెచ్‌డీ చేస్తూ ఉద్యోగం చేస్తున్నారు. అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న జర్మనీకి చెందిన ఫాబియన్ డువెన్ బేక్‌తో పరిచయమై అది ప్రేమగా మారింది. దీంతో ఇరువురూ తమ ఇళ్ళల్లో తల్లిదండ్రులకు తెలియజేసి అందరి అంగీకారంతో పెదవడ్లపూడి సాయిబాబా ఆలయంలో వైభవంగా వివాహం చేసుకున్నారు.
జర్మనీ అబ్బాయి.. ఆంధ్ర అమ్మాయి ఒక్కటైన వేళ

పద్మశాలి వెల్‌ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక