
బాలికలు భళా..!
గుంటూరు
ముగిసిన ప్రతిష్టా వేడుకలు
శావల్యాపురం: వేల్పూరు గ్రామంలో వేంచేసియున్న గంగమ్మ, పోతురాజుల, పేర్పిడి ప్రతిష్టా మహోత్సవాలు బుధవారంతో ముగిశాయి. భక్తులు భారీసంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
త్రికోటేశ్వర విగ్రహ పునఃజీవ ప్రతిష్ట
సత్తెనపల్లి: అమ్మిశెట్టి వారి వీధిలోని త్రికోటేశ్వర స్వామి విగ్రహ పునఃజీవ ప్రతిష్ట, దేవాలయం పునర్ నిర్మాణం, ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం బుధవారం జరిగాయి.
రెడ్డి పేరంటాలమ్మకు పూజలు
నాదెండ్ల: సాతులూరులో రూ.2 కోట్లతో నిర్మించిన రెడ్డిపేరంటాలమ్మ ఆలయంలో విద్యాదాత, గోల్కొండ గ్రూపు సంస్థల చైర్మన్ నడికట్టు రామిరెడ్డి పూజలు చేశారు.
గురువారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
గుంటూరు ఎడ్యుకేషన్ : మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైన 27,255 మంది విద్యార్థుల్లో 24,129 మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలు రాసిన 14,444 మంది బాలురులో 12,567 మంది ఉత్తీర్ణులు కాగా, 87 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అదే విధంగా 12,811 మంది బాలికలు పరీక్షలు రాయగా.. 11,562 మంది ఉత్తీర్ణులయ్యారు. 90.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది 88.14 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో 16వ స్థానానికి పరిమితమైన గుంటూరు జిల్లా ప్రస్తుత ఫలితాల్లో 88.53 శాతం ఉత్తీర్ణతతో నాలుగో స్థానానికి ఎగబాకింది.
ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల నుంచి పరీక్షలు రాసిన పేద కుటుంబాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యార్థులతో పోటీ పడి రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించడంతోపాటు జిల్లాలో టాపర్లుగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కావడంతోపాటు అధిక మార్కులు సాధించిన వారు వందలాదిగా ఉండటంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
20,504 మందికి ప్రథమ శ్రేణి
జిల్లాలో పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో అత్యధిక శాతం మంది ప్రథమ శ్రేణిలో పాసైన వారే ఉన్నారు. పరీక్షలు రాసిన 27,255 మందిలో 24,129 మంది ఉత్తీర్ణత సాధించగా, వారిలో 20,504 మంది ప్రథమ శ్రేణి పొందడం గమనార్హం. మిగిలిన వారిలో 2,512 మంది ద్వితీయ, 1,113 మంది తృతీయశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.
ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్లు వీరే
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు వచ్చాయి.
● తాడికొండ ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థి పఠాన్ మొహమ్మద్ అబ్దుల్ రెహ్మాన్ అత్యధికంగా 592 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచాడు.
● సంగం జాగర్లమూడి జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని మద్దినేని మనోజ్ఞ, తెనాలి కొత్తపేటలోని ఎస్డీఐఎం మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని షేక్ ఉస్నే జహా, పెదకాకాని జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని షేక్ రిజ్వానా, కొల్లిపర మండలం వల్లభాపురం జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని తియ్యగూర పూజితారెడ్డి, మంగళగిరి వీవర్స్ కాలనీలోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల విద్యార్థి పి.వరుణ్‌సాయి 591 మార్కులు సాధించారు.
● జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులను జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక అభినందించారు. అత్యుత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయులను, విద్యార్థులను, వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు.
పదో తరగతిలో జిల్లా విద్యార్థులు మెరిశారు. కన్నవారి కలలు నిజం చేసేలా పలువురు అత్యుత్తమ మార్కులు సాధించారు. మొత్తమ్మీద బాలుర కంటే బాలికలు సత్తా చాటి భళా అనిపించారు. బుధవారం ఎస్సెస్సీ బోర్డు ప్రకటించిన పరీక్షా ఫలితాలలో జిల్లాలో 88.53 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
జిల్లాలో ఏడాదివారీగా ఫలితాలు ఇలా..
సంవత్సరం ఉత్తీర్ణత శాతం రాష్ట్రస్థాయిలో స్థానం
2020 ఆల్ పాస్
2021 ఆల్ పాస్
2022 68.20 7
2023 77.40 6
2024 88.14 16
2025 88.53 4
3
న్యూస్‌రీల్
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో హవా
జిల్లాలో 88.53 శాతం ఉత్తీర్ణత
రాష్ట్రస్థాయిలో జిల్లాకు 4వ స్థానం
గతేడాదితో పోలిస్తే మెరుగైన ర్యాంక్
సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల
విద్యార్థులు
ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన
20,504 మంది

బాలికలు భళా..!

బాలికలు భళా..!

బాలికలు భళా..!

బాలికలు భళా..!

బాలికలు భళా..!

బాలికలు భళా..!

బాలికలు భళా..!

బాలికలు భళా..!

బాలికలు భళా..!

బాలికలు భళా..!

బాలికలు భళా..!