
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
తెనాలి అర్బన్: వారంతా వివిధ రంగాల్లో స్థిరపడిన వారు. తమ మనుమళ్లు, మనుమరాళ్లుతో ఆడుకునే వారు ఒకే వేదికపై కలిసి చిన్ననాటి మధురస్మృతులను నెమరువేసుకుని సందడి చేశారు. తమ జీవితాల్లో జరిగిన కష్టసుఖాలను పాలుపచుకుని ఆనందంగా గడిపారు. దీనికి తెనాలి కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూల్ వేదికగా మారింది. 1974–75 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఆత్మీయ అలింగనాలు చేసుకున్నారు. ఆనాటి గురువులు పిచయ్య, రూతు, పిచ్చేశ్వరమ్మ, ప్రస్తుత ప్రధానోపాధ్యాయురాలు షేక్ మౌలాబీలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమాన్ని డాక్టర్ దానబోయిన కృష్ణసాయిబాబు, పట్టెల మల్లేశ్వరరావు, అన్నవరపు మధు, సజ్జా మధుసూదనరావు, చిన్నం హేమ చంద్రప్రసాద్, కొల్లిపర శంకరబాబు, గడ్డిపాటి కిషోర్‌లు పర్యవేక్షించారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం