
ఓంకార్
సాక్షిప్రతినిధి, వరంగల్: అసెంబ్లీ ఎన్నికల పోరులో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేవారు ఎందరో.. కానీ విజయ తీరాలకు చేరేది కొందరే. ప్రధాన పార్టీల అభ్యర్థులతో తొడకొట్టి బరిలో నిలిచి గెలవడం ఆషామాషీ విషయం కాదు. ఆ నియోజకవర్గంపై పట్టు మాత్రమే కాదు. ప్రజల మనసుల్లో స్థానం పొందాలి. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి 12 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రతీ ఎన్నికల్లో వందల సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అందులో ఇప్పటి వరకు ఐదుగురు మాత్రమే విజయబావుట ఎగురవేశారు.
1967 నుంచి...
ఉమ్మడి వరంగల్‌లో 1967 నుంచి స్వతంత్ర అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యే ప్రక్రియ కొనసాగింది. ప్రజలతో మమేకమై వాళ్ల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటే.. విజయాన్ని చేజిక్కించుకునేందుకు అవకాశం ఉందనడానికి ఆనాటి ఫలితాలే నిదర్శనం. 1967లో మొదలైన ఇండిపెండెంట్ అభ్యర్థుల ఎన్నిక ప్రక్రియ 2014 వరకు కొనసాగింది. అత్యధికంగా నర్సంపేట నియోజకవర్గంలో మూడు పర్యాయాలు ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓడించి స్వతంత్ర అభ్యర్థులకు ఓటర్లు పట్టం కట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్వతంత్రులుగా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన పలువురు శాసనసభలోకి అడుగు పెట్టారు.
ఎక్కడెక్కడ.. ఎవరెవరు?
ప్రధాన పార్టీల టికెట్ ఆశించి భంగపడ్డ క్రమంలో చాలామంది స్వతంత్రులుగా బరిలో నిలిచి గెలిచారు. కొందరైతే ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి నెగ్గిన సందర్భాలూ ఉన్నాయి.
● స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం 1957 నుంచి 1972 వరకు జనరల్ స్థానంగా ఉంది. 1978లో ఎస్సీ రిజర్వుడు చేశారు. 1967లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన టి.హయగ్రీవాచారిపై ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచిన తోకల లక్ష్మారెడ్డి 3,256 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. హయగ్రీవాచారికి 17,280 ఓట్లు రాగా.. లక్ష్మారెడ్డికి 20,536 ఓట్లు వచ్చాయి.
● 2009 వరకు నియోజకవర్గంగా ఉన్న చెన్నూరు రద్దు అయ్యి పాలకుర్తిగా ఏర్పడింది. చెన్నూరు నియోజకవర్గం నుంచి 1972లో కాంగ్రెస్ పార్టీ నుంచి నెమురుగొమ్ముల విమలాదేవి పోటీ చేయగా.. ఆమైపె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కె.మధుసూదన్‌రెడ్డి 1,714 ఓట్ల మెజార్టీ సాధించారు. ఈఎన్నికల్లో 25,654 ఓట్లు మధుసూదన్ రెడ్డికి రాగా.. విమలాదేవికి 23,940 ఓట్లు వచ్చాయి.
● నర్సంపేట నియోజకవర్గానికి 1957 నుంచి 2018 వరకు 14 పర్యాయాలు ఎన్నికలు జరిగా యి. 1985, 1989, 2014లో మూడుసార్లు ఇండిపెండెంట్లు గెలుపొందారు. 1985లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.ఉపేంద్రరావుపై ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన మద్దికాయల ఓంకార్ 21,398 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1989లో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి జనార్దన్‌రెడ్డిని ఢీకొట్టిన ఓంకార్ మరోసారి ఇండిపెండెంట్‌గా 11,095 ఓట్ల ఆధిక్యతను సాధించారు. 2014లో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన దొంతి మాధవరెడ్డి బీఆర్‌ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డిపై 18,376 ఓట్ల మెజార్టీ సాధించారు.
● ఒకప్పటి వరంగల్(ఇప్పుడు తూర్పు) 1952 నుంచి 2018 వరకు 15 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. 1962లో కాంగ్రెస్ అభ్యర్థి మీర్జాబేగ్‌పై ఇండిపెండెంట్ బి.నాగభూషణరావు 1,725 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆతర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన నాగభూషణరావు 1967లో ఆపార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి.. ఇండిపెండెంట్ అభ్యర్థి టి.ఎస్.మూర్తి చేతిలో ఘోర పరాజయం పొందారు.
● 2009 వరకు జనరల్ స్థానంగా ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి 1962, 1967లో స్వత్రంత్రులే విజయ పతాకాన్ని ఎగుర వేశారు. 1962లో సీపీఐ అభ్యర్థి పీఆర్‌రావుపై స్వతంత్ర అభ్యర్థి కె.లక్ష్మీనరసింహారెడ్డి 1,453 ఓట్ల ఆధిక్యతను సాధించారు. 1967లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన పి.ఉమారెడ్డిపై ఇండిపెండెంట్ అభ్యర్థి టి.పురుషోత్తమ రావు 9,296 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
● ములుగు నియోజకవర్గానికి ఒక ఉప ఎన్నిక కలుపుకుని 1952 నుంచి 2018 వరకు 16 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. 1967లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి పి.రామనరసయ్యపై పోటీ చేసిన సంతోశ్‌చక్రవర్తి 4,929 ఓట్ల మెజా ర్టీతో ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు.
ఇండిపెండెంట్లను గెలిపించిన
ఓరుగల్లు ఓటర్లు
తోకల లక్ష్మారెడ్డి నుంచి
దొంతి మాధవరెడ్డి వరకు
రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా
ఓంకార్ విజయం
‘పేట’.. సమస్యల మూట
నర్సంపేట నియోజకవర్గంలో
అసంపూర్తి అభివృద్ధి
కాబోయే ఎమ్మెల్యేకు
సమస్యల స్వాగతం..
‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్..
రూ.3లక్షల
నగదు స్వాధీనం
నడికూడ చెక్‌పోస్టు వద్ద
తనిఖీల్లో సీజ్
వివరాలు
IIలోu

దొంతి మాధవరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment