మానవ అక్రమ రవాణా నిర్మూలించాలి
వరంగల్: మానవ అక్రమ రవాణా నిర్మూలనకు ప్రతిఒక్కరూ నడుం బిగించాలని వరంగల్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి (డీఆర్డీఓ) కౌసల్యాదేవి అన్నారు. డీఆర్డీఏ సమావేశ మందిరంలో మండలస్థాయి సిబ్బంది (సీసీ, ఏపీఎం)కి మానవ అక్రమ రవాణా అంశంపై మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. కుటుంబం, సంఘంపరంగా ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండడం ద్వారా మానవ అక్రమ రవాణా నిర్మూలించవచ్చని పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా ద్వారా లైంగిక దోపిడీ, అవయవ దోపిడీ, శ్రామిక దోపిడీ, డ్రగ్స్ రవాణా లాంటి అసాంఘిక కార్యకలాపాలపై తరచూ ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. శిక్షకులు ఈశ్వర్, కిరణ్, కృష్ణమూర్తి మానవ అక్రమ రవాణా, సైబర్ ట్రాఫికింగ్, సంబంధిత చట్టాలు తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో డీపీఎంలు దయాకర్, భవాని, అనిత, సరిత, వివిధ మండలాల ఏపీఎంలు వేణు, సురేశ్, మహేందర్, సీసీలు కొమురయ్య, సుజాత, పద్మ, శారద, శ్రీలత, రమేశ్, ఏకాంబరం, కట్టయ్య తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ డీఆర్డీఓ కౌసల్యాదేవి
Comments
Please login to add a commentAdd a comment