సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
జనగామ: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం హాల్‌లో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఆర్డీఓ వెంకన్నతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ 14వ తేదీ వరకు సీఎం పర్యటనకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేయాలన్నారు. సభకు వచ్చే రూట్‌లు, వాహనాల పార్కింగ్ స్థలాలను గుర్తించడంతో పాటు రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండాలన్నారు. కలెక్టర్ రిజ్వాన్‌బాషా మాట్లాడుతూ సీఎం పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, ఏసీపీ భీంశర్మ, డీఆర్‌డీఓ వసంత, డీఏంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు, డీపీఓ స్వరూప, గృహనిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ వేణుమాధవ్, అధికారులు పాల్గొన్నారు.
సీఎం సభాస్థలి పరిశీలన
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని శివునిపల్లిలో ఈనెల 16న నిర్వహించనున్న సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభకు సంబంధించిన సభాస్థలాన్ని అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సభా స్థలం వద్ద చేపడుతున్న పనులను పరిశీలించారు. సీఎం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐలు శ్రీకాంత్, సతీష్ ఉన్నారు.
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
పనుల్లో వేగం పెంచండి
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
కలెక్టరేట్‌లో సమీక్ష
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment