మూల్యాంకన కేంద్రం పరిశీలన
కాళోజీ సెంటర్: వరంగల్ ఎల్‌బీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ మూల్యాంకన కేంద్రాన్ని ఇంటర్ బోర్డు అధికారులు మంగళవారం సందర్శించారు. ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన మూల్యాంకన కేంద్రంలో ఏర్పాట్లు, స్ట్రాంగ్‌రూంలు తదితర ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా క్యాంపు అధికారి, వరంగల్ జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాతోపాటు మహబూబాబాద్, ములుగు జిల్లాల మూల్యాంకన సిబ్బందికి శిక్షణ ఇచ్చి సోమవారం స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభించినట్లు వివరించారు. అలాగే, ఈనెల 22 నుంచి మొదటి స్పెల్‌లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, పొలిటికల్‌ౖ సెన్స్, ఈనెల 24 నుంచి రెండో స్పెల్‌లో ఫిజిక్స్, ఎకనామిక్స్, 26 నుంచి మూడో స్పెల్‌లో కెమిస్ట్రీ, కామర్స్, 28న నాలుగో స్పెల్‌లో హిస్టరీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment