డంపింగ్ యార్డు తొలగించాలని ఫిర్యాదు
మడికొండ: మడికొండ–రాంపూర్ మధ్యలోని చెత్త డంపింగ్ యార్డును తొలగించాలని అడ్‌హక్ కమిటీ సభ్యులు రాంపూర్, మడికొండ గ్రామస్తులు మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి ఫిర్యాదు అందించారు. స్పందించిన చిన్నారెడ్డి హనుమకొండ కలెక్టర్‌కు, బల్దియా కమిషనర్‌కు ఫోన్ చేసి డంపింగ్ యార్డుపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగారు. దీనిపై కలెక్టర్ ప్రావీణ్య స్పందిస్తూ త్వరలోనే డంపింగ్ యార్డును తొలగిస్తామన్నారు. ఫిర్యాదు తిరిగి కలెక్టర్‌కు అందించాలని చిన్నారెడ్డి అడ్ హక్ కమిటీ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో మెట్టుగుట్ట చైర్మన్ పైడిపాల రఘుచందర్, బైరి లింగమూర్తి, వస్కుల శంకర్, కమిటీ సభ్యులు దువ్వ నవీన్, పొనగోటి వెంకట్‌రావు, గడ్డం మహేందర్, వినోద్, శివ, నిఖిల్, కిషన్, కరుణాకర్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment