ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన కల్పించండి
మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణలో ఆర్పీల సేవలు కీలకం అని మేయర్ గుండు సుధారాణి అన్నారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు, రిసోర్స్ పర్సన్లతో మేయర్ సమావేశమయ్యారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. 2020 ఆగస్టు 26కు ముందు రిజిస్ట్రేషన్ పూర్తయిన, లే–ఔట్, పాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అవగాహన కల్పించాలని కోరారు. రెగ్యులరైజ్ చేసుకోవడానికి 25 శాతం రాయితీతో ఈ నెలాఖరు వరకే ప్రభుత్వం గడువు ఇచ్చిందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బల్దియా ప్రధాన కార్యాలయం, కాజీపేట, కాశిబుగ్గ సర్కిల్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జీడబ్ల్యూఎంసీకి సంబంధించి మీ సేవ కేంద్రాల్లో కూడా చెల్లింపులు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ రాజేశ్వర్‌రావు, ఏసీపీలు ఏర్షాద్, రజిత, టీఎంసీ రమేశ్, కమ్యునిటీ ఆర్గనైజర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment