
పూడిక మట్టి వేగంగా తరలించండి
హన్మకొండ కల్చరల్: భద్రకాళి చెరువు పూడికతీత మట్టి తరలింపు ప్రక్రియ వేగంగా జరగాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు పి.ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం భద్రకాళి చెరువు పూడికతీత పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో కలెక్టర్లు, వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్వినితానాజీ వాకడేతో కలిసి పరిశీలించారు. మట్టి తరలింపు కోసంవేస్తున్న ఫార్మేషన్ రోడ్టు పనులు, వాహనాల కూపన్లను పరిశీలించారు. పూడికతీత మట్టిని ఎంత తరలించారనే వివరాలను నీటి పారుదలశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్లు మాట్లాడుతూ పూడికతీత మట్టిని బుధవారం నుంచి ప్రారంభించాలని, పనులు జరుగుతున్న ప్రాంతంలో విద్యుత్‌లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. మట్టి తరలింపు వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. పనులు సజావుగా సాగేలా అధికారులు సమస్వయంతో కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, సాగు నీటి పారుదలశాఖ ఈఈ శంకర్, డీఈ హర్షవర్ధన్, ‘కుడా’ పీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ఇతరశాఖల అధికారులు పాల్గొన్నారు.
హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద
భద్రకాళి చెరువు పూడికతీత పనుల పురోగతి పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment