కుటుంబ వ్యవస్థపై ఫాతిమా మాత అనుగ్రహం
● ఓరుగల్లు పీఠాధిపతి, విశాఖ అగ్రపీఠాధిపతి ఉడుముల బాల
● ఫాతిమామాత ఉత్సవాలు ప్రారంభం
కాజీపేట రూరల్: నేటి కుటుంబ వ్యవస్థ విధానంపై ఫాతిమా మాత అనుగ్రహం అవసరమని ఓరుగల్లు మేత్రాసనం పీఠాధిపతి, విశాఖ అగ్ర పీఠాధిపతి బిషప్ డాక్టర్ ఉడుముల బాల అన్నారు. కాజీపేట ఫాతిమానగర్‌లో మంగళవారం ఫాతిమా మాత తిరునాళ్ల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కేథడ్రల్ చర్చిలో రాత్రి జరిగిన కుటుంబాల సంరక్షిణి మరియ మాత అంశంతో ఓరుగల్లు పీఠ కాపరి, విశాఖ అగ్ర పీఠ కాపరి బిషప్ ఉడుముల బాల తిరునాళ్ల ఉత్సవాలు ప్రారంభించి భక్తులను ఆహ్వానించారు. అనంతరం చర్చి సభ్యుల్లో రజిత, స్వర్ణ జుబిలి దంపతులను బిషప్ సన్మానించి ఆశీర్వదించారు. అనంతరం బిషప్ అందరికీ ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వాదాలు ఇచ్చారు. కార్యక్రమంలో చర్చి ఫాదర్లు కాసు మర్రెడ్డి, ప్రకాశ్, ఆశీర్వాదం, చర్చీ కమిటీ పాల్గొంది. విద్యుత్ కాంతుల్లో కేథడ్రల్ చర్చి, ప్రాంగణ వీధులు జిగేల్‌మంటున్నాయి.
ఫాతిమా చర్చిని సందర్శించిన వరంగల్ డీసీపీ సలీమా
కాజీపేట ఫాతిమా కేథడ్రల్ చర్చిని వరంగల్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా చర్చి ప్రాంగణంలో కలియదిరిగారు. చర్చీ ఫాదర్లు, కమిటీ సభ్యులతో మాట్లాడి బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. పోలీస్ శాఖ తరఫున సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చినట్లు కేథడ్రల్ చర్చి కమిటీ ప్రెసిడెంట్ బొక్క దయాసాగర్, ట్రెజరర్ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. కాజీపేట సీఐ సుధాకర్‌రెడ్డి తదితరులు ఆమె వెంట ఉన్నారు.
ఫాతిమామాత ఉత్సవాల్లో సంగీత సాధన
కాజీపేట ఫాతిమానగర్ పాస్ట్రల్ సెంటర్‌లో మంగళవారం తిరునాళ్ల ఉత్సవాల్లో భాగంగా సంగీత సాధన కార్యక్రమం జరిగింది. పునీత సెసిలిమా అకాడమీ డైరెక్టర్ ఫాదర్ నమిండ్ల సురేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని పాస్ట్రల్ సెంటర్ డైరక్టర్ ఫాదర్ తాటికొండ జోసెఫ్, అరుణోదయ యూత్ డైరెక్టర్ ఫాదర్ పొలిమెర సురేశ్ ప్రార్థనలు చేసి ప్రారంభించి సందేశం ఇచ్చారు. ట్రైసిటీలోని 12 విచారణ చర్చీల నుంచి గాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కలపాల ప్రవీణ్, నల్ల ప్రణీల్, రవి, గాయని, గాయకులు పాల్గొన్నారు.
కుటుంబ వ్యవస్థపై ఫాతిమా మాత అనుగ్రహం
Comments
Please login to add a commentAdd a comment