జీనోమ్ ప్రాజెక్టుతో వ్యాధుల గుర్తింపు
కేయూ క్యాంపస్ : జీనోమ్ ప్రాజెక్టు మానవుడి వ్యాధులకు కారణమైన జన్యువులను గుర్తించొచ్చని 2010లోనే వెల్లడైందని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం కాకతీయ యూనివర్సిటీలోని జువాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘ఇన్నోవేటివ్ టెక్నిక్స్ ఇన్ అనిమల్ బయోటెక్నాలజీ, ఇమ్యూనాలజీ ఫర్ డిసిస్ ప్రివెన్షన్స్ అండ్ మేనేజ్‌మెంట్’ అనే అంశంపై మంగళవారం ఆ విభాగం సెమినార్‌హాల్‌లో నిర్వహిస్తున్న జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జాతీయ సదస్సుకు భారతదేశం నుంచి పరిశోధకులు, అకడమిషియన్లు పాల్గొని జంతు శాస్త్రాల పరిశోధన పురోగమనంపై చర్చించడాన్ని కొనియాడారు. అనంతరం బయో ఫార్మా డైరెక్టర్ గీతా శర్మ ‘డ్రగ్ డిస్కవరీ’ అనే అంశంపై మాట్లాడుతూ ఒక మాలిక్యుల్ డ్రగ్‌గా మార్కెట్‌లోకి రావడానికి తక్కువలో తక్కువ 10 సంవత్సరాలు పడుతుందన్నారు.అంతేకాకుండా 10 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు అవుతుందన్నారు. కానీ బయో ఇన్ఫర్మాటిక్స్ అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఖర్చు, సమయం రెండూ కలిసి రావడం పరిశోధన రంగంలో జరిగిన పురోగతిగా భావించొచ్చని తెలిపారు. ఈ జాతీయ సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ వై. వెంకయ్య మాట్లాడుతూ ఈ రెండు రోజుల జాతీయ సదస్సులో వందకు పైగా రీసెర్చ్ స్కాలర్స్, వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు తమ పరిశోధన పత్రాలు సమర్పించబోతున్నారన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షురాలిగా జూవాలజీ విభాగ అధిపతి జి. షమిత, విశిష్ట అతిథిలుగా సైన్స్ డీన్ జి. హన్మంతు, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ ఈసం ఈసం నారాయణ, ప్రొఫెసర్ ఇస్తారి పాల్గొన్నారు. వీసీ, ఇతర అతిథులు జాతీయ సెమినార్‌కు వచ్చిన పరిశోధన పత్రాల సావనీర్‌ను ఆవిష్కరించారు. సదస్సు ఈనెల 12న ముగియనున్నది.
కేయూలో జాతీయ సదస్సులో వీసీ ప్రతాప్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment