
వరంగల్ డీసీసీబీని నంబర్ వన్‌గా నిలపాలి
● టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు
హన్మకొండ : వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకును అన్ని డీసీసీబీల్లోకెల్ల నంబర్ వన్‌గా నిలపాలని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు అన్నారు. అధికారులు శ్రద్ధగా పని చేసి బ్యాంకు అభివృద్ధి కృషి చేయాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బ్రాంచ్‌ల వారీగా ప్రగతిని సమీక్షించారు. అనంతరం చైర్మన్ రవీందర్ రావు మాట్లాడుతూ నాబార్డు సమీక్షలో వరంగల్ డీసీసీబీ ‘ఏ’ ర్యాంకు అవార్డు సాధించేలా బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రుణమాఫీ లబ్ధి పొందిన రైతులకు త్వరిగతిన కొత్త పంట రుణాలు అందించాలన్నారు. ఐఆర్‌ఏసీ నామ్స్ మేరకు ఈ ఆర్థిక సంవత్సరం ముగింపులోపు మొండి బకాయిలు రాబట్టి నిరర్థక ఆస్తులు 2 శాతానికి తగ్గించాలని ఆదేశించారు. టర్నోవర్ రూ.2500 కోట్లకు చేరుకునేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్, జనరల్ మేనేజర్ ఉషా, డీజీఎం అశోక్, ఏజీఎంలు మధు, గొట్టం స్రవంతి, బోడ రాజు, గంప స్రవంతి, కృష్ణ మోహన్, డీఆర్ ఓఎస్డీ విజయ కుమారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment