![అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి](/styles/webp/s3/article_images/2024/11/13/12wgl128-330081_mr-1731439178-0.jpg.webp?itok=LbEAnD78)
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: గడువులోగా అభివృద్ధి పనులు ప్రారంభించకపోతే టెండర్ రద్దు చేసి, రీకాల్ చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్‌లో మేయర్, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే మంగళవారం ఇంజనీర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 15వ ఆర్థిక సంఘం, సాధారణ నిధులు, ఫ్లడ్ డ్యామేజ్, గ్రీన్ ఫండ్స్, ఎస్సీ సబ్‌ప్లాన్, స్మార్ట్‌సిటీ పనులపై నియోజకవర్గాల వారీగా ఆరా తీశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ వరంగల్ ట్రైసిటీతోపాటు విలీన గ్రామాల్లోని పనులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. జంక్షన్లు, శ్మశానవాటికల్లో మౌలిక వసతులు, రోడ్లు, సైడ్ డ్రెయినేజీల నిర్మాణ పనులకు ప్రాధాన్యం ఇచ్చి దశలవారీగా పూర్తిచేయాలని సూచించారు. కొనసాగుతున్న పనులను త్వరితగతిన పూర్తిచేయడంతో పాటు ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు వెంటనే టెండర్ పూర్తిచేసి ప్రారంభించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కమిషనర్ జోనా, సీఏంహెచ్‌ఓ రాజారెడ్డి, ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఎంహెచ్‌ఓ రాజేశ్, ఈఈలు శ్రీనివాస్, మహేందర్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment