![సూపర్](/styles/webp/s3/article_images/2024/11/14/14.11.24city_mr-1731550918-0.jpg.webp?itok=b96cT813)
సూపర్ మెమొరీ
గురువారం శ్రీ 14 శ్రీ నవంబర్ శ్రీ 2024
వయసులో చిన్నవాళ్లు. ప్రతిభలో ఘనులు. వేదిక ఏదైనా అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటారు. నచ్చిన రంగంలో రాణిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.. ఉమ్మడి వరంగల్‌కు చెందిన చిచ్చరపిడుగులు. ఒకరేమో సంప్రదాయ నృత్యం ప్రదర్శించి చూపు తిప్పనివ్వకుండా చేస్తే.. మరొకరేమో పద్యాల్ని రాగం తీస్తూ పలుకుతున్నారు. ప్రపంచంలోని వెహికిల్స్‌ను చూసి పేర్లు చెప్పే బుడత ఒకరైతే.. ప్రాణాలకు తెగించి కాపాడిన బాలురు మరికొందరు. ఇంకో బాలుడైతే స్కూలుకు తొందరగా వెళ్లేందుకు సొంతంగా ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసుకున్నాడు. నేడు (గురువారం) జవహర్‌లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం సందర్భంగా ఔరా! అనిపించుకుంటున్న చిన్నారులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
జనగామ: ఐదేళ్ల వయస్సులోనే వండర్ బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకుని వహ్వా అనిపిస్తోంది జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి నరసింహమూర్తి, శ్వేతా లక్ష్మి దంపతుల కుమార్తె కేఎల్‌ఆర్ రిహాన్షి. పట్టణంలోని ఓప్రైవేట్ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న చిన్నారి, స్థానిక మైత్రేయ కూచిపూడి కళాక్షేత్రం గురువు పులిగిల్ల సుఖేశ్ మాస్టర్ వద్ద రెండున్నరేళ్ల వయస్సు నుంచే నృత్యంలో తర్ఫీదు తీసుకుంటోంది. జనగామలో హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఏకచత్వారింశత్ నిమిష నృత్య పద్య పఠన ప్రదర్శన నిర్వహించారు. ఆసమయంలో చిన్నారి వయస్సు ఐదేళ్లు. ఇందులో రిహాన్షి 41 నిమిషాల పాటు నాన్ స్టాప్‌గా నృత్య ప్రదర్శన చేస్తూనే.. కంటిన్యూగా 42 వేమన పద్యాలు చెప్పి అందరినీ అబ్బురపర్చి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. చిన్నారికి రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో స్ట్రాంగ్ గర్ల్ పేరుతో ప్రముఖ సినీహీరో సుమన్ చేతుల మీదుగా రుద్రమదేవి అవార్డు అందించారు. హైదరాబాద్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆధ్వర్యంలో జరిగిన కళాకారుల సమ్మేళనంలో చిన్నారి రిహాన్షి ప్రదర్శనకు ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులయ్యారు. బుద్ధగయలో జరిగిన అంతర్జాతీయ ఆధ్యాత్మిక సదస్సులో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రేమ్ కుమార్ చార్లెస్ థామ్సన్ చిన్నారి నృత్యం చూసి అభినందించారు.
రిహాన్షి
జనగామ: జనగామ పట్టణానికి చెందిన ఐదేళ్ల బుడతడు ప్రపంచంలోని కార్ల బొమ్మలు చూపిస్తే ఠక్కున వాటి పేర్లు చెప్పేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నాడు. జనగామ పట్టణం గీతానగర్‌కు చెందిన పృధ్వీసాగర్‌రెడ్డి–సింధుజ దంపతుల కుమారుడు రొండ్ల హర్షద్ రాంరెడ్డి. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. ఇతడికి మూడేళ్లు ఉన్నప్పటి నుంచే ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు 80 రకాల కార్లు, ద్విచక్రవాహనాల బొమ్మలు కొనిచ్చారు. తరచూ కార్లు, బైక్‌ల బొమ్మలు చూపిస్తుండడంతో అతడు ప్రపంచంలోని అన్ని కార్లను, ద్విచక్రవాహనాల పేర్లు చెబుతున్నాడు.
రొండ్ల హర్షద్ రాంరెడ్డి
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్
అందుకుంటున్న చిన్నారి (ఫైల్)
నృత్యం, పద్య పఠనం, సాహసం, నూతన ఆవిష్కరణలు వారి సొంతం
● తమకంటూ ప్రత్యేక గుర్తింపు ● నేడు బాలల దినోత్సవం
నాన్ స్టాప్ నర్తన
న్యూస్‌రీల్
విభిన్న రంగాల్లో మన్ననలు పొందుతున్న బాలలు
![సూపర్ మెమొరీ 1](/gallery_images/2024/11/14/13jgn059-330003_mr-1731550918-1.jpg)
సూపర్ మెమొరీ
![సూపర్ మెమొరీ 2](/gallery_images/2024/11/14/13hmkd58-330086_mr-1731550918-2.jpg)
సూపర్ మెమొరీ
![సూపర్ మెమొరీ 3](/gallery_images/2024/11/14/13jgn058-330003_mr-1731550918-3.jpg)
సూపర్ మెమొరీ
Comments
Please login to add a commentAdd a comment