![సాహసమే శ్వాసగా..](/styles/webp/s3/article_images/2024/11/14/13mbd305-330031_mr-1731550921-0.jpg.webp?itok=5Ha1GfxN)
సాహసమే శ్వాసగా..
కేసముద్రం: వ్యవసాయ బావిలో కారు పడిన ప్రమాదంలో ఇద్దరు బాలురు సాహసం చేశారు. ముగ్గురి ప్రాణాలను కాపాడారు. 2022లో జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించి ఆ సాహస బాలురను అభినందనలతో ముంచెత్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన బానోతు భద్రునాయక్, హచ్చాలి దంపతులు, కుమార్తె సుమలత, మనవడు దీక్షిత్‌తో కలిసి 2022 అక్టోబర్ 28న తన బావమరిది బిక్కుతో కలిసి కారులో అన్నారం షరీఫ్‌కు వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో కేసముద్రం మీదుగా మహబూబాబాద్ వైపునకు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు కేసముద్రంస్టేషన్ బైపాస్ రోడ్డులో ఉన్న వ్యవసాయబావిలో పడింది. అదే సమయంలో మూత్రవిసర్జన కోసం పాఠశాల నుంచి బయటకు వచ్చిన సిద్ధు, రంజిత్ తమ ప్రాణాలకు తెగించి బావిలో దూకారు. కారు అద్దాలు పగులగొట్టి సుమలత, ఆమె కుమారుడు దీక్షిత్, డ్రైవర్ బిక్కును కాపాడారు. అప్పటికే కారు మునిగిపోవడంతో మిగిలిన నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఎంతో సాహసం చేసి ముగ్గురి ప్రాణాలు కాపాడిన సిద్ధు, రంజిత్‌లను అప్పటి కలెక్టర్‌తోపాటు గ్రామస్తులు అభినందనలతో ముంచెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment