
ప్రజల్లో అవగాహన పెంచాలి
● కమిషనర్ అశ్విని తానాజీ వాకడే
వరంగల్ అర్బన్: తడి, పొడి చెత్తను ఇళ్లల్లో వేర్వేరుడబ్బాల్లో వేసి అందించేందుకు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. శుక్రవారం వరంగల్ పోతన సెకండ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్, కంపోస్ట్ యూనిట్‌ను కమిషనర్ తనిఖీ చేశారు. ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో పొడి చెత్త సేకరణ రిజిస్టర్‌ను పరిశీలించారు. తనిఖీల్లో సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ రాజేశ్, శానిటరీ సూపర్‌వైజర్ భాస్కర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు శ్యామ్‌రాజ్, వెంకన్న, ఐటీసీ వావ్ ప్రతినిధి పవన్, ఏంఐఎస్ గౌతమి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment