
కోటలో ఆస్ట్రేలియన్ల సందడి
ఖిలా వరంగల్: చారిత్రక ప్రసిద్ధి చెందిన ఖిలావరంగల్ కోటను శుక్రవారం ఆస్ట్రేలియా దేశస్తులు సందర్శించారు. ఈసందర్భంగా శిల్ప కళా సంపదను ఆసక్తిగా తిలకించారు. ఆతర్వాత ఖుష్‌మహల్‌ను వారు సందర్శించి నిర్మాణ శైలి మహా అద్భుతంగా ఉందని కొనియాడారు. కాకతీయుల చరిత్ర, విశిష్టత గురించి కోట గైడ్ రవియాదవ్ విదేశీయులకు వివరించారు. సాయంత్రం టీజీటీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కాకతీయుల చరిత్రను వివరించే సౌండ్, లైటింగ్ షోను తిలకించారు. కార్యక్రమంలో టీజీటీడీసీ ఇన్‌చార్జ్ గట్టికొప్పుల అజయ్, పురావస్తుశాఖ కో–ఆర్డినేటర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment