సర్వీస్‌ కొనసాగింపు | - | Sakshi
Sakshi News home page

సర్వీస్‌ కొనసాగింపు

Published Sat, Feb 15 2025 1:23 AM | Last Updated on Sat, Feb 15 2025 1:23 AM

సర్వీ

సర్వీస్‌ కొనసాగింపు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తూ ఇటీవల రిటైర్డ్‌ అయిన ముగ్గురు కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల సర్వీస్‌ను కొనసాగిస్తూ రిజిస్ట్రార్‌ వి.రాంచంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగ విరమణ పొందిన బాటనీ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లక్ష్మారెడ్డి, యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల బీఏ జర్నలిజం విభాగానికి చెందిన ఆర్‌.ఆదిరెడ్డి, కెమిస్ట్రీ విభాగానికి చెందిన ఉషారాణి సర్వీస్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

న్యాయవ్యవస్థపై దాడి

అమానుషం

వరంగల్‌ లీగల్‌: రంగారెడ్డి జిల్లా 9వ అదనపు కోర్టు జడ్జిపై గురువారం జరిగిన దాడిని న్యాయ వ్యవస్థపై దాడిగా భావిస్తున్నామని, ఇది అమానుష చర్య అని వరంగల్‌ జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తీగల జీవన్‌గౌడ్‌ అన్నారు. దాడికి నిరసనగా శుక్రవారం జిల్లా కోర్టు ఎదుట వరంగల్‌, హనుమకొండ బార్‌ అసోసియేషన్ల ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా అఽధ్యక్షుడు జీవన్‌గౌడ్‌ మాట్లాడుతూ.. నిందితులు, కక్షిదారులు తమ ప్రయోజనాలు నెరవేరలేదనే కక్షతో న్యాయమూర్తులు, న్యాయవాదులపై దాడులు చేయడం సహించరాని విషయమని, ప్రభుత్వం సత్వరమే నిందితులపై చర్యలు తీసుకోవాలని, న్యాయవ్యవస్థలో పనిచేసే వారి కోసం రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఈచర్యపై ప్రజలంతా నిరసన తెలపాలని హనుమకొండ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రమేశ్‌బాబు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బార్‌ కౌన్సిల్‌ సభ్యులు దుస్సా జనార్దన్‌, జయాకర్‌, బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు లడే రమేశ్‌, సుదర్శన్‌, చారి, విజయేందర్‌, మురళి, సహోదర్‌రెడ్డి, అంబరీశ్‌, రాజేంద్రప్రసాద్‌, సీనియర్‌, జూనియర్‌, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.

హాస్టళ్ల జాయింట్‌

డైరెక్టర్ల నియామకం

కేయూ క్యాంపస్‌: కేయూ హాస్టళ్ల జాయింట్‌ డైరెక్టర్లుగా ఫిజిక్స్‌ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎ.నరేందర్‌, మైక్రో బయాలజీ విభాగానికి చెందిన డాక్టర్‌ సుజాతను నియమిస్తూ శుక్రవారం కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. వీరు పదవిలో ఏడాదిపాటు బాధ్యతలు నిర్వర్తరించనున్నారు. కేయూ వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి వీరికి నియామక ఉత్తర్వులు అందజేశారు.

సీడీపీఓ కార్యాలయ

స్థల మార్పు

కాజీపేట అర్బన్‌: హనుమకొండ సర్క్యూట్‌ గెస్ట్‌ హౌజ్‌ ఎదురుగా కొనసాగుతున్న హనుమకొండ అర్బన్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ సీడీపీఓ కార్యాలయాన్ని కేఎల్‌ఎన్‌ రెడ్డి కాలనీలోని చేనేత జౌళిశాఖ కార్యాలయం పక్కకు మార్చినట్లు శుక్రవారం సీడీపీఓ విశ్వజ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రకాల పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చేవారు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

‘ఎన్‌హెచ్‌ఎం’తో

తగ్గిన మరణాలు

ఎంజీఎం: జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ద్వారా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల వల్ల మాతా శిశు మరణాల రేటు చాలా వరకు తగ్గిందని.. మరింత మెరుగైన సేవలందిస్తూ గర్భిణుల్లో అనారోగ్యాన్ని ముందుగానే గుర్తించి తగిన సేవలందించాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. శుక్రవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఆర్మన్‌ స్వచ్ఛంద సంస్థ, జాతీయ ఆరోగ్య మిషన్‌ సంయుక్తంగా జిల్లాలోని పలు యూపీహెచ్‌సీ, పీహెచ్‌సీల ఏఎన్‌ఎంలకు నిర్వహించిన శిక్షణలో అప్పయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయకుమార్‌, ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ మంజుల, వైద్యులు సంతోషిని, సౌజన్య, డెమో అశోక్‌రెడ్డి, ఎస్‌ఓ ప్రసన్నకుమార్‌, హెచ్‌ఈఓ రాజేశ్వర్‌రెడ్డి, డీడీఎం ప్రవీణ్‌, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సర్వీస్‌ కొనసాగింపు1
1/2

సర్వీస్‌ కొనసాగింపు

సర్వీస్‌ కొనసాగింపు2
2/2

సర్వీస్‌ కొనసాగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement