
మహా శివరాత్రికి ఏర్పాట్లు చేయాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద
వరంగల్: మహా శివరాత్రిని పురస్కరించుకుని ఆలయాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈనెల 26న శివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. వరంగల్‌లోని కాశీవిశ్వేశ్వరస్వామి, స్వయంభు దేవాలయం, ఆకారపు బొమ్మలగుడి, దుర్గేశ్వరాలయం, భోగేశ్వరాలయం తదితర ఆలయాల్లో రుద్రాభిషేకం, సామూహిక బిల్వార్చన, రుద్ర హోమం, ప్రవచనాలతోపాటు క్యూలైన్ మేనేజ్‌మెంట్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, దేవాదాయశాఖ సహాయ కమిషనర్ సునీత, ఈఓ రత్నాకర్‌రెడ్డి, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ మధుసూదన్‌రావు, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, బల్దియా ఉప కమిషనర్ ప్రసన్నరాణి, ఈఈలు మహేందర్, శ్రీనివాస్ ఎంహెచ్‌ఓ రాజేశ్, ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ, ఎస్సై చాంద్‌పాషా పాల్గొన్నారు.
గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి సహకరించాలి
జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి భూములు ఇచ్చి రైతులు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్‌లో భూ సేకరణకు సంగెం గ్రామ రైతులతో శుక్రవారం ఆమె సమావేశమయ్యారు. ఈసందర్భంగా రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవేతో జిల్లా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్ రాజ్‌కుమార్, పర్యవేక్షకులు శ్రీకాంత్ రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment