
వసతుల కల్పనకు నిధులు వినియోగించాలి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్: జిల్లాలోని ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైసింగ్ ఇండియా (పీఎం శ్రీ) పథకం కింద ఎంపికైన పాఠశాలలకు మంజూరైన నిధులను ఆయా పాఠశాలల్లో వివిధ వసతుల కల్పనకు సత్వరమే వినియోగించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని పీఎం శ్రీ పథకం నిధుల వినియోగం, అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లా అధికారులతో పాటు ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఏఈలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. ఆయా పాఠశాలల్లో నిధులతో గ్రంథాలయం ఏర్పాటు, మ్యూజికల్ బ్యాంకు ఏర్పాటు క్రీడోత్సవాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులకు స్నాక్స్ అందించాలని సూచించారు. సమావేశంలో డీఈఓ వాసంతి, సమగ్రశిక్ష గుణాత్మక విద్య సమన్వయ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, కమ్యునిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ బద్దం సుదర్శన్‌రెడ్డి, జీసీడీఓ సునిత, ప్రణాళిక అధికారి బి.మహేశ్, సహాయ గణాంక సమన్వయకులు రఘు చందర్‌రావు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment