
‘జంపన్న’లో స్నానం..అమ్మవార్ల దర్శనం
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మల గద్దెల ప్రాంగణం శుక్రవారం భక్తుల రద్దీతో కోలాహలంగా మారింది. అమ్మవార్లను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు మేడారానికి తరలివచ్చారు. జంపన్నవాగు వద్ద స్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీర, సారె, ఎత్తు బంగారం, పూలు, పండ్లు, ఒడి బియ్యం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం పరిసరాలన్నీ భక్తుల రద్దీతో కనిపించాయి. మొక్కుల అనంతరం భక్తులు వంటావార్పు చేసుకొని సహఫంక్తి భోజనాలు చేసి తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా నేటి (శనివారం)తో మేడారం మినీజాతర ముగియనుంది.
జాతరలో మెరుగ్గా పారిశుద్ధ్య పనులు..
మేడారం మినీజాతరలో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా సాగుతున్నాయి. జాతరకు వచ్చే భక్తులకు ఎక్కడా కూడా పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా కార్మికులు చెత్తా, చెదారాన్ని తొలగించి శుభ్రం చేస్తున్నారు. రోడ్ల వెంట దుమ్ము, దూళి లేవకుండా ట్యాంకర్లతో నీళ్లు చల్లుతున్నారు. డీపీఓ దేవరాజ్ పారిశుద్ధ్య పనులు నిరంతరం పర్యవేక్షిస్తూ చెత్త సేకరణపై కార్మికులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.
భక్తులకు ఉచిత తాగునీరు
మేడారంలో భక్తులకు అక్కడక్కడ ఉచిత తాగు నీటి శిబిరాలను ఏర్పాటు చేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిని శిబిరాలను తరలించి భక్తులకు అందిస్తున్నారు. జాతరకు వచ్చిన భక్తులకు ఉచిత తాగునీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎండతీవ్రత పెరగడంతో భక్తులకు ఉచిత తాగు నీటి శిబిరాలు దాహాన్ని తీరుస్తున్నాయి.
పూజా మందిరంలో పొగలు..
ఎండోమెంట్ కార్యాలయంలో శా లాహారం ప్రహరీకి అనుకొని ఉ న్న వనం పూజా మందిరంలో పొ గలు వ్యాపించాయి. మందిరంలో ని చెత్త చెదారానికి ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో అక్కడే ఉన్న దేవాదాయ శా ఖ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది స్పందించి ఫైర్ ఇంజన్ ద్వా రా మంటలను చల్లార్చారు. పూ జా మందిరంలో ఒక్కసారి పొగ వ్యాపించడంతో ఎండోమెంట్ అధికారులు, వివిధ శాఖల సిబ్బంది ఏం జరిగిందోనని ఆందోళన చెందారు.
వనదేవతలకు మొక్కులు
సమర్పించిన భక్తులు
మార్మోగిన గద్దెల ప్రాంగణం
నేటితో మినీ జాతర ముగింపు

‘జంపన్న’లో స్నానం..అమ్మవార్ల దర్శనం

‘జంపన్న’లో స్నానం..అమ్మవార్ల దర్శనం

‘జంపన్న’లో స్నానం..అమ్మవార్ల దర్శనం

‘జంపన్న’లో స్నానం..అమ్మవార్ల దర్శనం

‘జంపన్న’లో స్నానం..అమ్మవార్ల దర్శనం

‘జంపన్న’లో స్నానం..అమ్మవార్ల దర్శనం
Comments
Please login to add a commentAdd a comment