వరంగల్: పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న ఆమె పీఎంశ్రీ, సర్వశిక్ష అభియాన్ నిధుల వినియోగం, అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ జిల్లా పరిధిలో పీఎంశ్రీ పథకం కింద 16 పాఠశాలలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో చేపట్టిన పనుల్లో కొన్ని పూర్తయ్యాయని, కొన్ని పనులు వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ నిధులతో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. డీఆర్‌ఓ విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment