
నర్సిరెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించండి
● టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవి
కాళోజి సెంటర్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా మరోమారు అలుగుబెల్లి నర్సిరెడ్డిని గెలిపించాలని టీఎస్ యూ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి పిలుపునిచ్చారు. జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ, అధ్యాపకుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, గురుకులాల పనివేళలను మార్చాలని, డిప్యూటీ వార్డెన్, కేర్ టేకర్లను నియమించాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నర్సిరెడ్డి మరోసారి ఎమ్మెల్సీగా గెలిస్తేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని రవి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర కార్యదర్శి వెంకటప్ప, తాటికాయల కుమార్, సుజన్ ప్రసాదరావు, మేకిరి దామోదర్, భగవంత రావు, గుండు కరుణాకర్ పాల్గొన్నారు.
సీసీఐ కొనుగోళ్లపై విచారణ చేయాలి: పెద్ది
వరంగల్: సీసీఐ పత్తి కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ చేయాలని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యాపారులు మార్కెట్‌కు వచ్చిన పత్తిని రూ.5 వేల నుంచి 6 వేలకు మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు. సీసీఐకి విక్రయిస్తే రూ.7521 మద్దతు ధర వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏడుగురు మార్కెట్ కార్యదర్శులను ఇటీవల సస్పెండ్ చేయడం అవినీ తి అక్రమాలకు నిదర్శనమని పేర్కొన్నారు. అన్ని వ్యవసాయ మార్కెట్లలో ఈ కుంభకోణం జరిగిందని, రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలువు దోపిడీ చేసిందని ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment