24 కిలోల గంజాయి స్వాధీనం
ఖిలా వరంగల్: రైలులో గంజాయి తరలిస్తున్న దంపతులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.6 లక్షల విలువైన 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్ వెంకటరత్నం వెల్లడించారు. పక్కా సమాచారం మేరకు శుక్రవారం వరంగల్ రైల్వేస్టేషన్‌లో సంబంధిత అధికారులు నిఘా పెట్టారు. ఈక్రమంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన దంపతులు గోగి శంకర్‌దాస్– గోగి పూర్ణిమదాస్‌లు ఒడిషాలో ప్రదీప్ అనే గంజాయి స్మగ్లర్ వద్ద 24 కిలోల గంజాయి కొనుగోలు చేసి ముంబై–భవనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో బయల్దేరారు. శుక్రవారం వరంగల్ రైల్వేస్టేషన్‌లో రైలు దిగి బయటకు వెళ్లేందుకు యత్నిస్తుండగా.. డగ్స్ కంట్రోల్ టీం, మిల్స్‌కాలనీ ఎస్సై సురేశ్ వారి బ్యాగులను తనిఖీ చేయగా గంజాయి లభించింది. వారిని అరెస్టు ఎండు గంజాయి, 2సెల్‌ఫోన్లు స్వాధీన పర్చుకుని మిల్స్‌కాలనీ స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment