బ్యాంకు ఉద్యోగుల ధర్నా
హన్మకొండ చౌరస్తా: తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని వరంగల్ జిల్లా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో అశోక జంక్షన్‌లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద వివిధ బ్యాంకుల ఉద్యోగులు శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సమితి అధ్యక్షుడు కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. బ్యాంకుల్లో పనిఒత్తిడికి సరిపడా నియామకాలు చేపట్టాలని, ఐదు రోజుల పనిదినాలు వర్తింపజేయాలని కోరారు. ఉద్యోగులకు పనిచేసే ప్రాంతంలో రక్షణ కల్పించాలని, వర్క్‌మెన్ డైరెక్టర్, ఆఫీసర్లు, డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయాలని, ఉద్యోగుల సంక్షేమ ప్రయోజనాలపైన వేసే ఆదాయ పన్ను బ్యాంకులే భరించాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 21న మరో ధర్నాతోపాటు మార్చి 3న పార్లమెంట్ ఎదుట ధర్నా, మార్చి 24, 25వ తేదీల్లో దేశవ్యాప్త సమ్మెలో అన్ని బ్యాంకుల ఉద్యోగులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో సమన్వయ సమితి కార్యదర్శి శశిధర్‌రెడ్డి, రాకేష్, కృష్ణమోహన్, రఘు, వేణుమాధవ్, ఏఐబీఓసీ దిలీప్‌కుమార్, అనిల్, సుందర్ నాయక్, శ్రీనివాస్, సాహిత్య, శ్రీనివాస్, ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment