గీసుకొండ: లింగనిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని డీఎంహెచ్‌ఓ బి. సాంబశివరావు అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం జరిగిన పీసీపీ ఎన్‌డీటీ జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. లింగనిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు విధిగా ప్రతీ నెల 5వ తేదీన ఫాం ఎఫ్ నివేదికలను తమ కార్యాలయంలో సమర్పించాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో రేడియాలజిస్టు లేదా గైనకాలజిస్టు మారితే ఆ వివరాలను అందించాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు ప్రకాశ్, మోహన్‌సింగ్, మాతాశిశు సంరక్షణ అధికారి అర్చన, అభ్యుదయ సేవా సమితి అధ్యక్షుడు మండల పరశురాములు, డీపీహెచ్‌ఎన్ ఓ.జ్ఞానసుందరి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment