హసన్‌పర్తి: మండల పరిధి జయగిరి శివారులోని మహాత్మాజ్యోతిరావు పూలే బాలుర గురుకులంలో శుక్రవారం రాత్రి ఆరుగురు విద్యార్థులు అస్వస్తతకు గురయ్యారు. కడుపు నొప్పి రావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఇందులో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించినట్లు ఉపాధ్యాయులు చెప్పారు. బాదం కాయలు తినడంతో వారు అ స్వస్థతకు గురైనట్లు తెలిపారు. కాగా, విద్యార్థుల ఆ రోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, సంఘటన జరి గిన రోజు రాత్రే సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు తహసీల్దార్ చల్లా ప్రసాద్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment