
‘సమ్మర్’కు సిద్ధం
20 ఏళ్లుగా వస్తున్నాను..
ఏ పట్నం వేయాలన్నా కావాల్సిన పూజా సామగ్రి కోసం నడికూడకు రావాల్సిందే. నేను 20 ఏళ్లుగా వచ్చి తీసుకుని వెళ్తున్నాను. రూ.12 వేల నుంచి రూ.15 వేలలో నాణ్యమైన గజ్జెల లాగు సెట్టు దొరుకుతుంది.
– రామ్మూర్తి, కేసముద్రం
●
– వివరాలు 8లోu
గద్దెల ప్రాంగణంలో భక్తులు
హన్మకొండ: రోజురోజుకూ ఎండలు మండుతుండడంతో విద్యుత్ సరఫరా డిమాండ్ క్రమేపీ పెరుగుతోంది. వేసవిలో వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించేందుకు ఈసారి టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ కనబర్చింది. ముందస్తు వ్యూహంతో ముందుకు వెళ్తోంది. డివిజన్లు, సర్కిళ్ల వారీగా ప్రత్యేకంగా వేసవి ప్రణాళికను రూపొందించుకుంది. ఈప్రణాళిక అమలుకు కార్యాచరణ రూపొందించుకుని వేసవిలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించారు. హనుమకొండ సర్కిల్‌లో ఈనెల 5న గరిష్టంగా 5.41 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. రాబోయే మూడు నెలల్లో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగే అంచనాలు ఉండడంతో సరిపడా సదుపాయాలు కల్పించారు. వేసవి ప్రణాళికలో భాగంగా హనుమకొండలో కొత్తగా 16 అదనపు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయగా.. మరో 40 ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచారు. అయిదు 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌లలో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచారు.
ప్రత్యామ్నాయం ఏర్పాటు
ప్రకృతి వైపరీత్యాల సమయంలోనీ, మెయింటనెన్స్ సమయంలో, ఇతర కారణాల చేత ఒక లైన్‌లో లేదా సబ్ స్టేషన్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే అంతరాయాలు లేని విద్యుత్ అందించేందుకు 7 ప్రత్యామ్నాయ (ఇంటర్ లింకింగ్) విద్యుత్ లైన్లు వేశారు. వేసవి ముందస్తు ప్రణాళికలో భాగంగా వరంగల్ జిల్లాలో కొత్తగా 124 అదనపు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. 13 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచారు. 9 సబ్‌స్టేషన్లలో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో, మెయింటనెన్స్ సమయంలో కానీ, ఇతర కారణాల చేత కానీ ఒక లైన్‌లో లేదా సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే అంతరాయాలు లేని విద్యుత్ అందించేందుకు 16 ప్రత్యామ్నాయ (ఇంటర్ లింకింగ్) విద్యుత్ లైన్లు వేశారు.
మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు
హనుమకొండ జిల్లాలో
40 ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు
16 కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు
వరంగల్ జిల్లాలో కొత్తగా 124..
13 ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు
సబ్‌స్టేషన్ల సామర్థ్యం కూడా..
ఇంటర్ లింకింగ్ లైన్‌లు సిద్ధం

‘సమ్మర్’కు సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment