
మెరుగైన సేవలతో వైద్య ఖర్చులు తగ్గించొచ్చు
ఎంజీఎం/దామెర: ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు ప్రజలకు మెరుగ్గా అందించడం వల్ల వారిపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించవచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాయక్ అన్నా రు. ఆదివారం ఆయన దామెర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ల్యాబ్, ఫార్మసీ, వ్యాక్సిన్ స్టోర్, ఆయుష్, ఎన్‌సీడీ, ఇతర విభాగాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం రవీంద్రనాయక్ మాట్లాడు తూ ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు క్షేత్రస్థాయిలో ప్రజలకు వివిధ ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించడం, పీహెచ్‌సీ సేవలు అందించడం ద్వారా వారు ఉన్నత స్థాయి వైద్య సేవలకు వెళ్లకుండా కాపాడవచ్చన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లోని 12 రకాల వైద్య సేవలు సక్రమంగా అందించాలని చెప్పారు. టీబీ, లెప్రసీ, ఎన్‌సీడీ కార్యక్రమాల్లో గుర్తించిన వారికి తగిన చికిత్సతో పాటు ఫాలోఆప్ సేవలు ముఖ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో హనుమకొండ డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య, పీఓడీటీటీ డాక్టర్ కె.లలితాదేవి, ప్రో గ్రాం అధికారులు డాక్టర్ హిమబిందు, డాక్టర్ ఇస్తేదార్ అహ్మద్, డాక్టర్ మంజుల, వైద్యాధికారి డాక్టర్ మహేంద్ర, డాక్టర్ ప్రమోద్‌కుమార్, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్‌రెడ్డి, సీహెచ్‌ఎన్ లీల, సూపర్‌వైజర్లు శ్రీకాంత్, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్
డాక్టర్ రవీంద్రనాయక్
Comments
Please login to add a commentAdd a comment