
టీచర్ ఎమ్మెల్సీగా గెలిపించాలి
కేయూ క్యాంపస్: వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ది పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి కోరారు. ఆదివారం కాకతీయ యూనివర్సిటీ క్రీడామైదానంలో మార్నింగ్ వాకర్స్, అధ్యాపకులను కలిసిన ఆయన.. తనను గెలిపిస్తే ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. శాసనమండలిలో గళమెత్తి పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. వర్సిటీలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల భర్తీకి కృషిచేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేశారు. పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు మంద తిరుపతిరెడ్డి, బాధ్యులు దేవిరెడ్డి, కొండారెడ్డి, డాక్టర్ కుందూరు సుధాకర్, మహేందర్‌రెడ్డి, విజయ్‌పాల్ పాల్గొన్నారు.
మార్నింగ్ వాకర్స్‌ను కోరిన
అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment