
సదుపాయాలను వినియోగించుకోండి
వరంగల్ లీగల్: నిత్యం కోర్టుకు వచ్చే న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వసతులను సద్వినియోగం చేసుకో వాలని హైకోర్టు న్యాయమూర్తి, వరంగల్, హనుమ కొండ జిల్లాల పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ మౌసమీ భట్టాచార్య అన్నారు. ఆదివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హైడ్రాలిక్ లిఫ్ట్, న్యాయవాదుల కారు పార్కింగ్ షెడ్లను జస్టిస్ భట్టాచార్య వర్చువల్‌గా ప్రారంభించారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు నిర్మల గీతాంబ, సీహెచ్.రమేశ్‌బాబు, రెండు జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు తీగల జీవన్‌గౌడ్, మాతంగి రమేశ్‌బాబు, కార్యదర్శి లడే రమేశ్, బార్ కౌన్సిల్ సభ్యుడు సిరికొండ సంజీవరావు, న్యాయవాద సంఘం ప్రతినిధులు, న్యాయమూర్తులు, సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.
జస్టిస్ మౌసమీ భట్టాచార్య
Comments
Please login to add a commentAdd a comment