హన్మకొండ చౌరస్తా: వరంగల్‌ను మురికివాడలు లేకుండా సుందర నగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. 4వ డివిజన్ పరిధి పెద్దమ్మగడ్డ, యాదవనగర్, జ్యోతిబసునగర్ కాలనీల్లో ఆదివా రం పర్యటించిన ఆయన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతర్గతరోడ్లు, సైడ్ డ్రెయినేజీల నిర్మాణం, తాగునీరు తదితర పనులన్నింటినీ దశల వారీగా పూర్తి చేస్తామని చెప్పారు. నాయకులు రాజేందర్, కుమార్‌యాదవ్, శ్రీధర్‌యాదవ్, మాజీ కార్పొరేటర్ బోడ డిన్నా, రాజు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment