
నీటి శుద్ధి.. అవినీతి బుద్ధి!
వరంగల్ అర్బన్: నీటి శుద్ధి పేరిట ప్రజాధనం పక్కదారి పడుతోంది. తెరవెనుక రహస్య ఒప్పందాల మేరకు లక్షల సొమ్ము చేతులు మారుతోంది. బల్దియా పాలకవర్గం అధికారుల గూడుపుఠాణితో ప్రజాధనం నీళ్లలా ఖర్చవుతోంది. ఏ పార్టీ అధికా రంలో ఉన్నా.. ఒకే ఒక్క కాంట్రాక్టర్‌ది ఆడింది ఆట.. పాడింది పాటగా నడుస్తోంది. ఉన్నతాధికారుల్ని మచ్చిక చేసుకోవడంలో, వారికీ వాటాలు పంచడంలో అతడిది అందెవేసిన చెయ్యి అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పర్యవేక్షణ కరువు..
ఆలమ్, క్లోరిన్, సిలిండర్లు, బ్లీచింగ్ పౌడర్ సరఫరా సమయంలో ఎంత వచ్చిందో పర్యవేక్షించే నాథుడే కరువయ్యాడు. నీటి శుద్ధికి ఆలమ్ ఉపయోగించా ల్సి ఉంటుంది. కానీ.. ఇక్కడ సిబ్బంది ఇష్టారాజ్యంగా కలుపుతున్నారు. ఏమోతాదులో కలపాలో కార్మికులకు తెలియక, పరీక్షలు చేయకపోవడంతో నల్లాల్లో నీరు కలుషితమవుతున్నదని ప్రజల్లో అపనమ్మకం ఉంది. అందుకే తాగడానికి మినరల్ వాటర్ ప్లాంట్ల నుంచి నీటిని కొనుగోలు చేస్తూ.. వ్యక్తిగత అవసరాలకు నల్లా నీటిని వినియోగిస్తు న్నారు. అయితే మాకెందుకులే.. మాకొచ్చే సొమ్ము వస్తుంది కాదా.. అన్నట్లుగా ఇంజినీర్లు, సిబ్బంది వ్యవహరిస్తున్నారు. బల్దియా ఏడాదికి నీటి శుద్ధి కోసం రూ.2.50 కోట్లు వెచ్చిస్తోంది. అంతే కాకుండా.. ప్రజారోగ్యం విభాగంలో బ్లీచింగ్ ఫౌడర్ కోసం రూ. 80 లక్షల సొమ్ము ఖర్చు చేస్తోంది. ఈ రసాయనాలు సరఫరా చేసేది ఒకే వ్యక్తి కావడం గమనార్హం. రెండు, మూడు ఏళ్లుగా కాదు.. ఏళ్ల తరబడి అతడికి అనుకూలంగా టెండర్ నిబంధనలు రూపకల్పన చేస్తున్నారు. ఆయనకున్న లైసెన్స్‌లు, డీలర్ షిప్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని కాంట్రాక్టు దక్కేలా ఇంజనీరింగ్ విభాగంలోని డీబీ సెక్షన్ ఇంజనీర్లు, సిబ్బంది పూర్తి స్థాయిలో సహకరిస్తుండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. కాంట్రాక్టు విధానం వెనుక పెద్ద ఎత్తున చేతులు మారుతున్నాయనే ఆరోపణలు సైతం వస్తున్నాయి.
ఉత్తుత్తి పరీక్షలే!
నీటి శుద్ధికి సంబంధించిన ప్రయోగశాలల జాడే నగరంలో కనిపించడం లేదు. వాస్తవానికి అన్ని చోట్ల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నీటి పరీక్షలు నిర్వహించిన అనంతరం నల్లాలకు నీటి సరఫరా చేయాలి. కానీ.. దీనిపై ఇంజినీరింగ్ సిబ్బంది పెద్దగా దృష్టి కేంద్రీకరించడం లేదు. ఫలితంగా నగరంలోని పలు ప్రాంతాల్లో కలుషిత, బురద, దుర్వాసనతో కూడిన నీరు సరఫరా అవుతోంది. ఆనీరు తాగలేక ఇతర అవసరాలకు తీర్చుకుంటున్నారు. అపనమ్మకంతో తాగునీటి కోసం మినరల్ వాటర్ క్యాన్ల ద్వారా, ఇతర ప్లాంట్ల ద్వారా కొనుగోలుకు నగర ప్రజానీకం రూ.కోట్లు వెచ్చిస్తోంది. నీటి శుద్ధి పేరిట సాగుతున్న అవినీతి దందాపై మేయర్, కమిషనర్, ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంపై విమర్శలు ఉన్నాయి.
తనిఖీ చేస్తాం..
నీటి శుద్ధి కోసం కొనుగోలు చేసే ఆలమ్, క్లోరిన్, బ్లీచింగ్ పౌడర్ సరఫరా, వినియోగా న్ని ఎప్పుటికప్పుడు తనిఖీ చేస్తున్నాం. ఏమైనా తేడాలొస్తే చర్యలు తీసుకుంటాం.
– ప్రవీణ్ చంద్ర, బల్దియా ఎస్‌ఈ
ఫిల్టరింగ్ పేరిట రూ.కోట్ల మేత
20 ఏళ్లుగా బల్దియాను
శాసిస్తున్న బడా కాంట్రాక్టర్
ఆతడికి అనుకూలంగానే
టెండర్ నిబంధనలు
ఆలమ్, క్లోరిన్ సరఫరాలో అక్రమాలు
కొనేదానికి..వచ్చేదానికి వ్యత్యాసం
వ్యత్యాసం!
నగరంలోని దేశాయిపేట ప్రతాపరుద్ర, కేయూ రూద్రమాంబ, వడ్డేపల్లి, ధర్మసాగర్ రిజర్వాయ ర్ వద్ద తాగునీటి శుద్ధి చేసే ఫిల్టర్‌బెడ్లు ఉన్నా యి. ధర్మసాగర్ నుంచి వచ్చిన రా వాటర్ ఆయా ఫిల్టర్‌బెడ్ల ద్వారా శుద్ధీకరణ జరుగుతోంది. అందుకోసం వినియోగించే ఆలమ్, క్లోరిన్ మోతాదునిబంధనలు పాటించిన దాఖలాలు ఎక్కడా కనిపించవు. వీటి పేరుతో రూ.కోట్ల సొమ్ము పక్కదారి పడుతోంది. లక్షల కేజీలు కొంటున్నట్లుగా చెబుతున్నా.. బయట మార్కెట్‌కు, కాంట్రాక్టర్‌కు సరాఫరా చేసే ధరకు కేజీకి రూ.10 నుంచి రూ. 20 వరకు తేడా ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment