
‘సంకటహర’ పూజలు
హన్మకొండ కల్చరల్ : శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం సంకటహరచతుర్థి పూజలు ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యాన వేదపండితులు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి ప్రభాతపూజలు, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషే కం, సాయంత్రం 7 గంటలకు ఉత్తిష్టగణపతికి జల, క్షీర, పంచామృతం, నవరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేపట్టారు. ఇష్టమైన గరికతో షోఢశోపచార పూజలు చేశారు.
21 నుంచి మూడేళ్ల ‘లా’ మొదటి సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల కోర్సు మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్) ఈనెల 21 నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణా ధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిమ్ ఇక్బాల్ తెలిపారు. ఈనెల 21, 24, 28, మార్చి 3, 5 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నా రు. అలాగే ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల కోర్సు ఐదవ సెమిస్టర్ పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్) ఈనెల 22, 25, మార్చి 1, 4, 6 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని పరీక్షల నియంత్రణాధికారులు తెలిపారు.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు
మరో అవకాశం
విద్యారణ్యపురి: ఇంటర్మీడియట్ సైన్స్, ఒకేషన ల్ కోర్సుల విద్యార్థులకు ఈనెల 3 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించిన ప్రాక్టికల్ పరీక్షలకు వివిధ కారణాలతో హాజరుకాని విద్యార్థులకు ఇంటర్‌బోర్డు మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు హనుమకొండ డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పింగిళి బాలికల జూనియర్ కళాశాలలో ఈ ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని, ఇప్పటివరకు పరీక్షలకు హాజరుకాలేని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేలా సంబంధి త కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు సహకరించాలని కోరారు.
ముగిసిన ‘ఇన్నోథాన్–2.0’
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌లో నిర్వహిస్తున్న ‘ఇన్నోథాన్–2.0’ కార్యక్రమం ఆదివా రం ముగిసింది. నిట్ వరంగల్, హిటాచీ ఎనర్జీ సంయుక్తంగా నిర్వహించిన 30 గంటల ఎనర్జీ ఇన్నోవేషన్ ఇన్నోథాన్‌లో వివిధ కళాశాలల నుంచి 120 మంది విద్యార్థులు పాల్గొని నూత న ఆవిష్కరణలకు పోటీపడ్డారు. ముగింపులో భాగంగా నిర్వాహకులు విజేతలకు బహుమతులు, నగదు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో నిట్ ఇన్‌చార్జ్ డైరెక్టర్ వేణువినోద్ తదితరులు పాల్గొన్నారు.
నిట్‌లో ‘చిగురు–24’ వేడుకలు
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్, యూత్ ఫర్ సేవా, యూత్ రెడ్‌క్రాస్ ఆధ్వర్యాన వరంగల్ నిట్‌లో ‘చిగురు–24’ వేడుకలు ఆదివారం జరిగాయి. నగరానికి చెందిన 12 ప్రభుత్వ పాఠశాలల నుంచి 1,200 మంది విద్యార్థులు పాల్గొని కళలు, క్రీడలు, సాహిత్య రంగాల్లో 15 రకాల పోటీల్లో ప్రతిభ చాటారు. ఇందులో విద్యార్థులు రూపొందించిన అయోధ్య రామమందిర నమూనా విశేషంగా ఆకట్టుకుంది.
నేడు గ్రేటర్ గ్రీవెన్స్
వరంగల్: వరంగల్ మహా నగరపాలక సంస్థ కౌన్సిల్‌హాల్‌లో గ్రేటర్ గ్రీవెన్స్ కార్యక్రమం సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఒక ప్రకటనలో తెలిపారు. నగర పరిధి ప్రజలు తమ సమస్యలపై విజ్ఞప్తులను కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
నేడు వరంగల్ ప్రజావాణి
వరంగల్ కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 11 గంటలకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఒక ప్రకట నలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలపై వినతులను కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

‘సంకటహర’ పూజలు
Comments
Please login to add a commentAdd a comment